ఈ పుటను అచ్చుదిద్దలేదు
సీతారాములకు, బోయవాడు రావణాసురునికి ప్రతీకలు. కవిత్వమంటే Emotions recollected in Tranaluility అంటాడు వర్డ్సువర్తు అలా ఉద్రేక పడినవాల్మీకిహృదయం శాంతిపొందిన తరువాత అనిశ్చం సమాధిస్థితిలో అంతవరకూ అంతరాంతరాల్లో సుడులు తిరుగుతున్న రామ కధ కరమరూపం పొంది కావ్యంగా వెలువడింది. 'ఏకోరస: కరుణమేన ' అంటాడు భవభూతి. రామాయణమంతా కరుణస ప్రధానమే. అందుకే అది అజరామరమై ప్రపంచంలో గొప్ప కావ్యాలుగా పరిగణించబడే "ఇలియడ్" "ఒడిస్సే" లకంటే ప్రఖ్యాతి పొందింది.
ఇది ఇతిహాసమా, పురాణమా, జరిగిందా, జరగలేదా, జరిగితే శిధిలాలెక్కడ అని వెతుక్కోవడం అనవసరం. ఏదైతేనేమి? మానవజాతి మనుగడకు కావలసిన ధర్మాలను కాంతాసమ్మితంగా చెప్పిన మహాకావ్యం. It is a message to man అంటాడు కె.యం. మున్షీ. సుఖమయ జీవితానికికావలసిన ధర్మప్రబోధం, ఆదర్శ వ్యక్తిత్వం, పాతివ్రతత్వం, ఏక ప్రత్నీ వ్రతం, భాతృప్రేమ, పితృవాక్యపాలన ఇలా ఎన్నో నిబంధనలను మృదువుగా అందించిన ఉత్తమ గ్రంధం. నిజానికి ఇన్ని కులాలున్నా, ఇన్ని ప్రాంతాలున్నా, ఇన్ని భాషలున్నా ఈనాడు ఈ దేశాన్ని ఏకత్రాటిపై నడిపిస్తున్నవి రామాయణ భారతాలే. ప్రతి మనిషిలోనూ రాముడూఉజ్ంటాడు, రావణుడూఉంటాడు. ప్రతి స్త్రీలోనూ సీతాఉంటుంది, శూర్పణఖా ఉంటుంది. మనలో రావణపాలు, శూర్పనఖపాలు ఎంతవున్నదో చూసుకొని తగ్గించుకోవడానికి అద్దంలా ఉపయోగపడుతుంది. రామాయణకావ్యం. రామాయణంలో "ఏకైకమక్షరం స్రోక్తం మహాపాతక నాశనం" అన్నారు పండితుల్. ఒక్క రామశబ్దం తీసుకుంటే అది 'అష్ఠాక్షరి ', 'పంచాక్షరి ' లలోని అగ్ని, వాయు బీజాక్షరాల సంపుటి అని తెలుస్తుంది. "నమోనారాయణాయ" లోని 'రా ' 'నమశ్శివాయ ' లోని 'మ ' కలిపి "రామ" నామం ఏర్పడిందన్నారు తాత్వికులు. అందుకే 'రమేతి రమ: రామ: అని నిర్వచించారు. ఈ రామాయణం ఎన్నో భాషలలోకి అనువదింపబడింది. ఈ అనువాదాలలో యధామాతృకానువాదంకాకుండా ఆయా దేశ కాల ఆచార వ్యవహారాలను బట్టి అక్కడ జననాడినిబట్టి అనెక మార్పులు చేర్పులు చేసుకున్నారు ఆయా రచయితలు.