పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/406

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"వేదం ప్రభు పమ్మితం, పురాణం సహృత్ సమ్వితం, కావ్యం కాంతా సమృతం" వేదం ప్రభువులా శాసిస్తుంది. "సత్యం వధ ధర్మంచర" (సత్యం చెప్పు, ధర్మం ఆచరించు) అనేది ఆజ్ఞ. ఆజ్ఞను పాలించడం బానిస ప్రవృత్తిగా భావించి కొందరి మనసులు ఆచరణకు నిరాకరించవచ్చు. అందుకని పురాణ పురుషుల జీవితాలకు ఆ సద్గుణాలు ఆపాదించి క్జధలుగా మలిచారు. హరిశ్చంద్రుని కధలో సత్యం కోసం హరిశ్చంద్రుడు నిలిచిన తీరూ, దాని వలన పొందిన సత్కీర్తి వింటుంటే ఒక స్నేహితుడు సత్యం చెప్పు మేలుకలుగుతుంది, సత్యం చెప్పు మేలుకలుగుతుంది అని హితబోధ చేస్తున్నట్లుగా ఉంటుంది. విషయాన్ని మరింత ప్రీతిపాత్రంగా చెబుతుంది కావ్యం. ప్రియురాలు పడకటింటిలోఫ్ భర్తకు హృదయరంజకంగా చెప్పే మధురోక్తి లాంటిది అది. సరమో, వ్యంగ్యమో దీనికి ఆలంబనం. "నాదేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది, ఇంకా తెల్లవారనేలేదు." అనేదానిలో ఉన్న వ్యంగ్యం నలుబది సంవత్సరాల దేశ చరిత్రను గుండెకు హత్తుకొనేటట్టుచేస్తుంది. ఇదీకావ్యతత్వం. 'నానృషి: కురుతే కావ్యం ' అన్నారు పెద్దలు. వాల్మీకి ఋషి గనకనే శ్రీమద్రామాయణ కావ్యాన్ని అంత లోకోత్తరంగా వ్రాయగలిగారు. నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వెళ్లినపుడు సకల సద్గుణసంపన్నుడు, మనసా వాచా కర్మణా సత్యవాది అయిన నాయకుడెవరైనా ఉన్నారా అంటే ఉన్నాడరని అతడే అయోధ్య నేలుతున్న రాముడని రామచరిత్ర వివరించి వెళ్ళిపోయాడు. నాటినుండీ వాల్మీకి దృష్టి రామునిపైనేఉంది. ఒక రోజు ఉదయం తమసానది ఒడ్దున నడిచి వెళుతూ ఒకబోయవాడు చెట్టుపై నున్న క్రాంచనపక్షులజంటలో ఒకదానిని కొట్టగా అదిక్రిందపడి విలవిలతన్నుకొని ప్రాణాలు విదిచింది. దానికోసం రెండవపక్షి వలవల ఏడుస్తోంది. అది చూసిన వాల్మీకి హృదయం శోకంతో నిండిపోయింది. ఆశోకమే ఒక శ్లోకమై అతని నోటినుండి శాపంగా వెలువడింది.

"మా నిషాద ప్రతిష్ఠ్వాంత్వ మగమశ్శాశ్స్వతీ పమా:
  అత్క్రేంచ మిధునాదేశ మనధీ: కామమోబితం."

  "ఓ బోయవాడా కామ మోహితుడవై ఆ పక్షిజంటను వేరు చేశావు.  నీవు వృద్ధిని పొందవు" అని శపించాడు.  కట్టె, కొట్టె, తెచ్చె, తెచ్చ అన్నట్లు రామాయణమంతా ఈ చిన్ని శ్లోకంలోనే ఉంది.  పక్షిజంట