పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/405

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జానపదులు - రామాయణాలు

   తెలుగుజానపదులకు రామాయణం అత్యంతప్రీతిపాత్రం.  దీనిని ఎవరెన్నిసార్లుచ్వెప్పినా ఆప్యాయంగా, భక్తిగా, ఆసక్తిగా ఆలకిస్తూనే ఉంటారు.  తెలుగులో నిర్ఫచనోత్తర రామాయణం దగ్గరనుంచి నేటి రామాయణ కల్పవృక్షంవరకూ ఎన్నోరామాయణాలులొచ్చాయి.  ఎందరెందరో వ్రాశారు.  అందులో భాస్కరరామాయణం, అధాత్మికరామాయణం, చిత్రరామాయణం లాంటివి పండితాభిరుచికే పరిమితమైపోయాయి.  జాఅపదరామాయణం అని వేరే ఒక రామాయణం ఉంది. అదికూ?డా జానపదులను పట్టుకోలేదు.  కాని జానపదుల హృదయపీఠాన్ని అధిష్టించింది రంగనాధరామాయణం కధమాత్రమే కాబట్టి జానపదుల మనస్సుల్లో అంతగాఢంగా ముద్రవేసుకున్న రంగనాధరామాయణాన్ని పరామర్శించకుండా వదిలేస్తే జానపదుల అభిరుచిని సక్రమంగా దర్శించినట్టుకాదు.  అందువల్ల జానపద జనరంజకమైన రంగనాధరామాయణాన్ని కూడా స్థాలీపులాక న్యాయంగానైనా పరిశీలించడం అవసరం.
          రం గ నా ధ రా మా య ణం
   ఈదేశంలో నిజమైనరాజులు ముగ్గురేనట.  ఒకరు త్యాగరాజు, రెండవారు పోతరాజు, మూడోవారు గోపరాజు. నిధి చాలసుఖమా రాముని సన్నిధి సుఖమా" అని తన గానామృతంతో రాముని పాదాలనభిషేకించిన రామభక్తుడు త్యాగరాజు.  "పలికెది భాగవతమట, పలికించెడివాడు రామభధ్రుండట" అని భాగవతాన్ని రామాంకితంచేసిన మహాభక్తుడు పోతరాజు.  "ఏరీతిగ నను దయజూచెదవో ఇన వంశోత్తమ రామా" అని తన జీవితాన్ని రామమయం చేసుకున్న రామదాసు గోపరాజు.  ఈ కోవలోవాడే రంగనాధరామాయణకర్త బుద్ధరాజుకూడా.
      పూర్తిపేరు గోనబుద్ధారెడ్ది రామచరితను తెలుగులో వెలయించి తెలుగు జానపదుల హృదయాలలో శ్రీరాముని సుప్రతిష్ఠుని చేసినకవిరాజు ఆయన.