Jump to content

పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలాగే నూతిలోపడి, చెరువులోపడి, కాలువలోపడి బలవంతంచావు వాళ్ళు (పురుషులైనాసరే) భూత, ప్రేత, పిశాచలవుతారని విశ్వాసం. ఆ చనిపోయినవాళ్లు- ఆయింట్లోవారినిగాని ఆవీధిలోవారినిగాని బంధుమిత్రులను గాని ఆవేశించి తమకోర్కెలు చెప్పి అవి చెల్లింప చేసుకుంటారు. దెయ్యాలు ఆవేశించినవారి చిటికెనవ్రేలుగోరు నొక్కితే ఆ దెయ్యం వొదిలేస్తుందట.కొంతమందికి నవాసారద్రావణం వాసనచూపిస్తే ఆ ఘాటుకు వొదిలేస్తుంది కొంతమంది సాంబ్రాణి పొగ వేసి ఆ దెయ్యం కోరికలు చెప్పించి అవి తీరుస్తారు. కొంతమంది అనారోగ్యానికి గురైనప్పుడు ఎక్కడో ఏదో చూసి జడుసుకున్నారని అక్కడ శక్తి పట్టుకుందని ఆ ఆరోగ్య క్షీణానికి అది కారణమని భూతవైధ్యుని దగ్గరకు తీసుకువెళ్తారు. అతడు పరిపిండితో పిశాచిబొమ్మవేసి పద్మంవేసి అందులోఆరోగిని కూర్చుండబెట్టి ఓం, హ్రీం, క్రీం అని గట్టిగా అరుస్తూ పట్టుకున్న శక్తిని వద్లిపొమ్మనిచెప్తూ కోడిపెట్టకాలిగోరుకోసి ఆ రక్తంతో రోగికి తిలకంపెట్టి, నిమ్మకాఅలు సగానికికోసి రోగి తలచిట్టూ దొగదుడుచి పారేస్తాడు. మంత్రించి వేరుముక్క కట్టి విభూతి కుంకం ఇస్తాడు నిత్యం బొట్టుపెట్టమని. ఈవైద్యానికి భూతం వదిలేసి తగ్గిపోయిందనే వారూ ఉన్నారు. ఈ భూతవైద్యులకు తూర్పుగోదావరి జిల్లాలోని పడిసిలేరు, లక్ష్మీనరసాపురం, లొల్ల గ్రామాలు ప్రసిద్ధి. ఈ వైద్యులు పేకబెత్తం ఝుళి ఆవేశించిన భూతాన్ని మాట్లాడిస్తారు రోగిద్వారా. ఇందులో నిజమెంత ఉన్నా జానపదవైద్యంలోలో దీనికున్న ప్రసిద్ధిని కొట్టిపారేయ్యడానికి వీల్లేదు. ఈ భూతవైధ్యుల్లో కొందరు మాత్రరూపంలో మందులిచ్చి విడిపోయిన జంటలను కలపడం ఉంది. మనిషిని వశంచేసుకోవడానికి మందుపెట్టడం అనేది ఉంది. ఈ మందులు మైదెరకల స్త్రీలు ఇస్తుంటారు. ఎవరైనా ఒక పురుషుడు మరో స్త్రీ పట్ల మరీ మక్కువ చూపిస్తుంటే ఆమె మందో, మాకో పెట్టిందనడం జానపదులరివాజుమాట. భూతవైద్యానికి కొంతమందిముస్లింలు ఖురాను మంత్రాలు వ్రాసిన రక్షరేకులు, తాయెత్తులు కడతారు. దీనికోసం వీరుతీసుకొనే డబ్బులుకూడ తక్కువ. పసిపిల్లల జబ్బులకు వైద్యులదగ్గరికి వెళ్లడానికి బద్లు ముందుగా వీరిదగ్గరకే పరిగెడతారు. వారు ఉరుదూ లిపిలోఉన్న పుస్తకంలో ఆడబ్బులుపెట్టించి ఆ డబ్బులుపెట్టిన పేజీలో ఉన్న విషయముతో ఆ జబ్బునుచెప్పి దాని నివారణకు మంత్రించిన తాయెత్తును