పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిన్నుకాదు ఆ గోడను అంటాడు. వెంటనే ఆ గోడబెల్లు విరిగిపడుతుందట. ఇక్కడ నొప్పి తగ్గిపోతుండట. చెయ్యిగానీ, కాలుగానీ తెగితే వెంటనే గుంటకలవరాకు కట్తుకడతారు. మానిపోతుంది. కొండనాలుక పెరిగితే ఉప్పు, పసుపుపెట్టి నొక్కుతారు. తగ్గిపోతుంది. వ్రణాలకు పలస్త్రి పట్టు వేస్తారు. పిల్లల అనాసలకు కోనసీమలోని పుల్లేటికుర్రుగ్రామంలో నేటివ్ మందిస్తారు. అనాస తగ్గిపోతుంది.

ఇలాగ ఇంకా ఎన్నోజబ్బులను పెరట్లోమొక్కల పసర్లతోనూ, ఇంట్లో వస్తువులతోనూ ఖరీదులేని వైద్యం చేసే పెద్దవాళ్ళు ఆడా, మగా గ్ర్రామ గ్రామాన ఎందరో వుండేవారు. ఫీజులేని ప్రిస్క్రిప్ష్నన్. వీరే గ్రామానికి శ్రీరామరక్ష. నిజానికి వీళ్ళలో చాలమంది అక్షరజ్ఞానమున్న వాళ్ళుకూడా కాదు. వినికిడిద్వారానూ, అనుభవంద్వారాఊ అలవడిందే అంతా. వీళ్లు కొన్నింటికి ఈ మందులతోపాటు మంత్రంకూడా వేస్తారు. ఈ మంత్రం పూర్త్రిగా సైకలాజికల్ ట్రీట్ మెంట్. వాళ్ళు ఉచ్చరించే మంత్రమల్లా 'దేవుడా, పరమేశ్వరా, ఇతనికి ఈజబ్బు వెంటనే తగ్గించు తండ్రీ- ఈ మంత్రంతో ఈ జబ్బు తగ్గుగాక ' అని పలుసార్లు నో"టితో అంటుంటారు. ఆలోచిస్తే ఇది నేటి హిప్నాటిజం పద్ధతిని మూలరూపమే. డాక్టర్లు, నర్సులు అక్కర్లేకుండా ఎరుకలసానులే పురుళ్ళుపోస్తారు. ఒక్కోసారి వాళ్ళలో పెద్దవాళ్లుకూడా పురుళ్లుపోస్తారు. ఎరుకలసాని బోడ్డు కోస్తుంది అంతే. ఇంతాచేస్తే పురిటిఖర్చు కట్టుకునే పాతచీర ఒకటి ఆమెకు బహుమతి ఇవ్వటమే.

కాలక్రమంలో ఈ అనుభవవైధ్యం ఆయుర్వేదిక్, హోమియోపతిక్, అల్లోపతిక్ల మధ్య మరుగుకుపోయింది. అయినా ఈ నాటికీ ముసలమ్మలు ఈ వైద్యాలు చెప్పుతుంటారు అక్కడక్కడ. పేదలపాలిటి పెన్నిధివంటి ఈ వైద్యం కాలగర్భంలో కలిసిపోకముందే సేకరించి పరిరక్షించడం తక్షణ కర్తవ్యం. ప్రతి చిన్నజబ్బుకీ డాక్టర్లు వ్రాస్తున్న మందులజాబితా తట్టుకోలేక ఆక్రోసిస్తున్న సామాన్యుడికి ఇది ఎంతో ఉపశమనం.

జానపదులలో మరోవైద్యం ఉంది. అదీభూతవైద్యం. సాధారణంగా పురటాలు బలవంతంగా చచ్చిపోతే దెయ్యమౌతుంది అనినమ్మకం.