Jump to content

పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిగుళ్ళుతినడం. దీనికి కాకరకాఅకూడా శ్రేష్టం. ఉబ్బసం ఉపశమనానికి వేడినీళ్లల్లో తేనెవేసి త్రాగిస్తార్.

బాలింతలకు చనుబాలు వృద్ధికావడానికి, దేహంలో నీటినిహరించడానికి, వాతంనొప్పులు తగ్గించడానికి 'కాయం ' అనేమందు తయారుచేసి పెడతారు. సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, పిప్పిలికద్దె, కట్జుకరోహిణి, జీలకర్ర, వామ్ము, చాయపసుపుకొమ్ము, కళింగ దుంపరాష్ట్రం దోరగా వేయించి, వేడినీళ్ళలో మెత్తగానూరి లేహ్యం లాగా తయారెఉచేసి సున్నిఉండలలా చుట్టి నానబెట్టి ఓపదిహేనురోజులపాటు తినమంటారు. ఇవన్నీ ప్రతి వూళ్లల్లోనూ ప్రతికిరాణాకొట్టులోనూ దొరికేవే.

పాలు పడకుంటే పిప్పిలికట్టే, మిరియాలు పాలతో నూరి త్రాగిస్తారు. రక్తపోటు రగ్గించడానికి వెల్లుల్లి ఎక్కువగా నాడిస్తారు. అలాగేనీరుల్లికూడా. ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదని వీరి వాడుకమాట. రక్తపోటుకు కొంతమంది సర్పగంధి తత్సంబంధమైన వేళ్ళను ఔషధంగా ఇస్తారు. గుండెనొప్పికి లేత కొబ్బరికాయ నీళ్లు నిత్యం త్రాగమంటారు. పక్షవాతానికి గ్లాసుడునీళ్లల్లో రెండుచెంచాల తేనె రోజూ 3, 4 సార్లు త్రాగిస్తారు. పావురంరక్తం పక్షవాతంవచ్చిన భాగంమీద మర్ధనాచేస్తారు. తినేవాళ్ళ్ని పావురం మాంసంకూడా తినమంటారు. లావు తగ్గడానికి ఉదయంలేవగానే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చనినీటిలో సగం నిమ్మకాయరసం పిండి ఉప్పు, మిరియపుపొడి కలిపి తాగుతుంటే కొన్నాళ్ళకు తగ్గుతుంది.

పాముకరిస్తే వెంటనే 12 ఏండ్లబాలుని మూత్రం 150 గ్రాములు త్రాగిస్తే విషం విరిగిపోతుందట. సాధారణంగా దీనికి వైద్యం కళ్ళకు మిరియాలగంధం కలికంపెట్టి నిద్రరాకుండా చేసి నాగముషిణి గంధం త్రాగిస్తారు. కొంతమంది వైద్యులు పాముకాటుకు వెంటనే కరిచినచోటికి పైన త్రాడుతోబిగించి కట్టి రక్తప్రసారంకాకుండా నిలిపివేసి కాటువేసిన చోట ఏదైనా ఆయుధంతోకోసి రక్తంపిండి బయటకు కారేటట్టు చేస్తారు. తేలుకుడితే కొంతమంది గడ్డిపరకతో కుట్టినచోటరాస్తూమంత్రం వేస్తారు. ఈ మంత్రానికికూడా తగ్గిందనేవారున్నారు.మడేలుమంత్రం (మళయాళ మంత్రం, అని మరోచిత్రమైన మంత్రముంది- మంత్రించి అదికుట్టింది