మరిగించి ఆనునువెచ్చని నీటితో ప్రతిరోజొ మూడుసార్లు పుక్కిలించమంటారు. పుప్పిపళ్ళకు ఇంగువ పెడతారు.
కడుపునొప్పి వచ్చినా, అన్నం అరగకున్నా వామ్మూ ఉప్పూ కలిపి నమిలి మ్రింగిస్తారు. చెంబులో నిప్పులుపోసి కదుపుమీద కాపడం పెట్టిస్తారు. అల్లం, ఉప్పు నో'ట్లోవేసుకొని బాగానములుతూ రసం మ్రింగుతుంటే అజీర్తి పోయి ఆకలి పుడుతుంది.
జిగటవిరోచనాలకి పచ్చిసపోటా రసంగాని, పచ్చి అరటికాయగాని తినిపిస్తారు. దీనికి వేడిజిలేబి తినడంకూడా మందే. రక్తవిరోచనాలకి సగ్గుబియ్యం జావ త్రాగిస్తారు. నీళ్ళవిరోచనాలకి గసగసాల పొడుం తినమంటారు. ఏ విరోచనాలకైనా వీరి అస్లు సిస్లు మందు నల్లమందు. విరోచనాలుకావాలంటే ప్రొద్దుటే పరగడుపున వేడినీళ్ళలో చిట్టాముదం 2, 3 చెంచాలు వేసి త్రాగిస్తారు. కొందరు 'సునామణి ఆకు ' చారు కాచుకు త్రాగురారు. మలబద్ధకం పోవడానికి ఉసిరికాయ చూర్ణంతో చేసిన కషాయం వేడిపాలలో గిలక్కొట్టి త్రాగమంటారు.
జలుబుచేస్తే ఉపశమనానికి నల్లజీలకర్ర గుడ్డను కట్టి పీల్చమంటారు. సలసలమరిగే నీటిలో పసుపువేసి, ఇటుకవేసి, ముఖానికి ఆవిరి పడతారు. ముక్కుదిబ్బడేస్తే ముక్కుల్లో నువ్వులనూనెగాని, కొబ్బరినూనెగాని చుక్కలు వేస్తారు-సర్దుకుంటుంది. దగ్గు వస్తుంటే కరక్కాయ బుగ్గను పెట్టుకొని ఊట మ్రింగుమంటారు. కోరింతదగ్గుకు దానిమ్మకాయపెచ్చులు బాగా వేయించి ఆ చూర్ణం చిటికెడు తేనెలో కలిపి నాకిస్తారు. చంటిపిల్లలకు జలుబు చేస్తే తమలపాకు రసం రెండుచుక్కలు పాలల్లో పిండి పట్టిస్తారు.
వీరిడృష్టిలో జ్వరంవస్తే లంఖనం పరమౌషదం. జీలకర్ర, వామ్ము కషాయం పొంగబెట్టి త్రాగిస్తారు. నరాల అలహీనతకు మొలలొచ్చిన పెసలు గాని, శనగలుగాని తినమంటారు. శుక్ర నష్ట వ్యాధికి నేతితో చేసిన సున్నుండలు తినబెడతారు. నులిపురుగుకు (ఎమిబియాసిస్) అల్లోనేరేడుపండు మందు. చక్కెరవ్యాధికి (డయాబెటిస్) నేరేడుచెక్క కషాయం త్రాగమంటారు. అంతకంటే సులువు ప్రొద్దుటే పరగడుపున వేప