పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇచ్చి మొలకో, మెడకో, చేతికో కట్టమని చెప్పి, ఆ సాయంకాలం ఎర్ర్ర నీళ్ళు పచ్చనీళ్ళు దిగదుడిచి ఊరావల నలుగురూనడీచే రోడ్డుపై పొరబోయమంటారు.

కొందరు నాలుగుబాటలు కలిసినచోట దిగదుడిచిన బల్యన్నం పొయిస్తారు. ఈ భూతవైద్యంతోబాటు ఇంటిదగ్గర మామూలుగా గచ్చాకు పుచ్చాకు వైద్యంకూడా చేయిస్తుంటారు. దేనికి తగ్గుతుందో తెలియదు కాని మొత్తంమీద భూతవైద్యానికుకూడా గిరాకీ ఎక్కువే. దీర్గరోగాలకు నల్లకోడిపెట్టను దిగడిచి కోస్తారు. ఇంకా రోగం అలీయమైనదైతే పందితోనూ, డప్పులతోనూ మిట్టమధ్యాహ్నంవేళ దిగదుడుపు పెడుతుంటారు. వీధిలో అది తీసుకెళ్లేటప్పుడు ఎవరైనా చూస్తే ఆ భూతం ఆరోగిని వదిలి చూసినవారిని పట్టుకుంటుందని దిదుడుపు తమ వీధిదాటేవరకూ అందరూ తలుపులు మూసేసుకుంటారు. అయినా జాగ్రత్తకోసం ముందుగా ఒక మనిషి దిగదుడుపు వస్తుందని వీధిలో చెప్పుకుంటూ ముందుకెళతారు. కాకినాడదగ్గర పెదపూడిలోనూ, గొల్లలమామిడాడలోనున్న మర్కెట్టుషెడ్లో నూ ప్రతి ఆదివారం, లక్ష్మీవారం ఒక ముశ్లిం యీ భూతవైద్యం చేస్తాడు. చాలమందికి అతనిమాట నమ్మకం.

పశువులకు జబ్బుచేస్తే కూడా జానపదులు తమ జ్ఞానవైద్యంతోనే బాగుచేసుకుంటారు. కీళ్లనొప్పులు, వాతం నొప్పులకు గుర్రులేయిస్తారు. అంటే అక్కడా వాతలేస్తారు. ఆకలిపెంచడానికి ఉప్పు, నల్లేరు కలిపి కారం నీళ్ళతో గొంతులో గొట్టంతోపోస్తారు. దొమ్మరోగానికి కొఱ్ఱగంజిపోస్తారు. ఆవులు, గేదలి ఈనినపుడు బాలించరాలికి పాతబియ్యం అన్నంలాగే పాతవడ్లు, ఉలవలు ఉడకేసి పెడతారు. పశువులకు సాధారణంగా వచ్చే పారుడురోగం, కాళ్ళకుగాళ్ళు తగలడం, గొంతువాపు, గురకరోగం, మాద, కురము, వాతం ఇలాంటి జబ్బులుకూడా వీరు తమ నాటువైద్యంతోనే తగ్గింపచేస్తారు.

ఆహారం:

చేలో పండించుకున్న వడ్లు దంచుకుని చక్కగా బియ్యం చేసుకుని వండుకుంటారు. ఇది తవుడుతో కలిసివుంటుంది. 'బి ' విటమిన్ సంపూర్ణంగా