పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/398

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

34. వేదనభట్ల నరసింహమూర్తిగారు.

   కాకినాడ., రాగాన్ని ఎంతసేపయినా సాగదీని పాడగలదిట్ట.  నారద పాత్రకు పేరుగన్నారు.

35 కె.రామకృష్ణారెడ్దిగారు.

వెదురుపాక. హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు, విశ్వామిత్రుడు పాత్రలు పొషించేవారు. బొబ్బిలియుద్దంలో పాపారాయుడు బాగా వేసెవారు.

36. బేతా రామచంద్రరావుగారు.

   రాజమండ్రి.  బేతావెంకట్రావుగారిపుత్రుడు.  ఆయనాడుగుజాడల్లో ఆంజనేయపాత్ర పోషించేవారు.

37. సత్తి పత్తి (రెడ్ది)రాజుగారు.

కొమరిపాలెం. హరిశ్చంద్రలొ హరిశ్ఫంద్రుడు, రంగూన్ రౌడీలో తులసీరాంపాత్రలు జనరంజకంగా పోషించేవారు.

38. ద్రారపూడి సూర్యారావుగారు.

 ద్వరపూడి.  చింతామణిలో బిల్వమంగళపాత్రతో దేశమంతా ప్రఖ్యాతిపొందారు.  నిండయినవిగ్రహం. చక్కగా పాడతారు.

39. దేవులపల్లి పద్మనాభశాస్త్రిగారు.

   పిఠాపురం.  వీరు రామదాసుపాత్రలో లీనమై నటించేవారు.  "సీతమ్మకుచేయిస్తి చింతాకుపతకము" అనెపాటకు వీరి అభీనయం, నటన ఓసారిచూసినవారు మరచిపోలేరు.  

40. యస్. పి. లక్ష్మణస్వామిగారు.

    కాకినాడ.  తులాభారంలో నారదుడు, గయోపాఖ్యానంలో అర్జునుడు, చింతామణిలో భవానీశంకరుడు, రామదాసులో కబీరు, సక్కుబాయిలో జ్ఞానయోగి సమర్ధవంతముగా పోషించేవారు.

41. కాగిత సుబ్బారావుగారు.

 భీమవరం.  స్త్రీపాత్రలువేస్తారు.  నర్తనశాలలో సుధెష్ణగనూ, చింతామణిలో రాధగానూ, హరిశ్చంద్రలో చంద్రమతిగాను చక్కని హావభావ నటనలు ప్రదర్శిస్తారు.