పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/399

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

42. ఇళ్ళ వేంకట్రావుగారు.

తాడేపల్లిగూడెం:- కర్ణుడు, కృష్ణుడు, యయాతి, గయుడు చక్కగా నటించేగాయక నటుడు.

43. చల్లా వేంకటేశ్వరరావుగారు.

తణుకు:- అర్జునుడు పాత్రపోషణలో అతనికతనే సాటిగా నటించేవారు. వందలాది ప్రదర్శనలిచ్చిన నటుడు.

44. కర్ర అబ్బులుగారు.

అత్తిలిదగ్గర పాలంకిగ్రామము:- ఉద్యోగ విజయాలులో, గయోపాఖ్యానం నాటకాలలోని కృష్ణపాత్ర, రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయపాత్ర ఎంతో చక్కగా పోషించేవారు. ఎర్రగొల్లల నాటకాలలో వీరున్న నాటకానికి జనం తండోపతండాలుగా వచ్చేసేవారు.

45. కంచర్ల వెంకన్నగారు.

మారంపల్లి ప.గో:- ఈయనకూడా ఎర్రగొల్లల నాటకంలో పేరెన్నికగన్న నటుడు. కర్రి అబ్బులు కృష్ణుడు, కంచర్ల వెంకన్న అర్జునుడు కాంబినేషన్ చూడడానికి జనం ఎగబడేవారు. బ్రహ్మంగారిచరిత్రలో వీరబ్రహ్మంగా గొప్పపేరు తెచ్చుకున్నరు.

46.మాహాశివభటట్టు వెంకట్రాజుగారు.

వీరిని వెంకంగారనెవారు. రామదసు, కౄరసేనుడు, కంసుడు, పాపారాయుడు ప్రసిద్ధిగావేసేవార్. వీరు కౄరపాత్రధరించినపుడు భయబడనివారు, విషాదపాత్రధరించినపుడు దు:ఖించనివారు ఉండేవారుకారు. చక్కని కేరక్టరుయాక్టరు.

47. మహాశివభట్టు అమ్మిరాజుగారు.

తాడేపల్లిగూడెం. లవకుశలో లవుడు, కృష్ణలీలలో కృష్ణుడు మొదలగు బాలవేషములలో పేరుగాంచి ఎదిగాక బలరాముడు, అర్జునుడు, భవానీశంకరుడు, వీరబాహుడు వేషాలలో పేరెన్నికగన్నారు.

48. ఉల్లింకల సూర్యారావుగారు

   ఏలూరు.  మధురగాయకుడు. అర్ఝునుడు, కబీరుపాత్రలు, నక్షత్రకుడు, నారదుడు, గయుడు, బాగాపోషించి పేరుతెచ్చుకున్నారు.