పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/397

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

27. మాష్ఠర్ కళ్యాణిగారు:-

   రాజమండ్రి.  నారదునిపాత్ర ఎంతో ప్రతిభతో నటించేవారు.  వీరు కళ్యాణిరాగానికి పేటెంటు.

28. ఆచంట వెంకటరత్నంనాయుడుగారు.

   భీమవరం. కురుక్షేత్రంలో దుర్యోధనుడు, తులసీజలంధరలో జలందరును పాత్రలు విశిష్టంగా వేస్తారు.  జలంధరుడుగా దేశంలో ఆయనకు గొప్పపేరు.

29. కొచ్చెర్లకోట రంగారావుగారు.

  వీరిది రాజోలుదగ్గర తాటిపాక.  రంగూన్ రౌడీగా బాగాపేరు సంపాదించారు.  రౌడీలకెల్లరౌడీ, వీడే కొచ్చర్లకోటరౌడీ, చాలెంజిరౌడీ అని తొడకొట్టేవారు.  ఓన్లీడాటర్ లో "రంగడంటేరంగడా, మల్లెపూలరంగడా, కొచ్చెర్ల కోటరంగడా" అని పాడుతుంటే జనం కేరింతలుకొట్టేవారు.

30. మేడిశట్టి వెంకట్రావుగారు.

    పెద్దాపురం మాయాబజారులో అభిమన్యుడుగా, వీరాభిమన్యలో సైంధవుడుగా చాలాప్రదర్శనలిచ్చి గంభీరనాదంతో నిండైనవిగ్రంతో పుష్ఠికర సంవాదంతో చక్కని పేరుతెచ్చుకున్నారు.

31. మద్దాలి రామారావుగారు.

   తాడేపల్లిగూడేం. బాలనాగమ్మలో ఫకీరు, మైరావణలో మైరావణ పాత్రకు దేశప్రసిద్దిగన్నారు.  దుర్యోధనుడు, కుచేలుడువంటి దుష్ఠపాత్రలు పోషించుటలో పేరుగన్ననటు;డు.

32. పసల సూర్యచంద్రరావుగారు.

    తాడేపల్లిగూడెం.  రామదాసునాటకంలో తానీషాకు గొప్పపేరు. వీరు ఆంధ్రాఅసెంబ్లీలో డెప్యూటీస్పీకరుపదవి నిర్వహించారు.

33. యం.వి. నరసింహారావుగారు.

        రాజమండ్రి.  చాణక్యపాత్రకు పేరెల్లినవారు.  వీరు అభినవ చాణక్యుడుగా కీర్తిగడించారు.