పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/370

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గొల్ల: కాదు గాడిదేఎక్కువ. శీకుట్నుడు (శ్రీకృష్ణుడు) పుట్టినప్పుడు
      వసుదేవుడు గాడిదకాళ్ళట్టుకున్నాడా బేమ్మడికాళ్ళట్టు
      కున్నాడా? కాబట్టి బేమ్మడికంటే గాడిదేఎక్కువ. కోపగించు
      కోకండిబాబయ్యా.
గురువు: నాకు కోపంరాదురా
గొల్ల: చీ దైద్రుడా: (దరిద్రుడా) నువ్వు బేమ్మడువేనా?
గురువు: దొంగవెధవా! ఏవన్నావ్?
గొల్ల: మరిమీకు కోపంరాదన్నారుగదండీ? ఓడిపోయారోచ్.
      ఇలాచమత్కారేసంభాషణ గమ్మత్తుగా నడుస్తుంది.

                  ఫ కీ రు వే షం
    ప్రేక్షకుల్లొ ఒకరినిపిలిచి యిలా జోస్యం చెబుతాడు.  అతనిచెయ్యి చూస్తూ "మీకు తలంచినకార్యం తప్పకావుతుంది, మీకుడికంట్లో భాగ్యరేఖవుంది.  ఎడమకంట్లో లక్ష్మివుంది.  తలచినతలపు, కోరినకోరిక కొనసాగుతాఇ.  వశీకరణరేఖ వుంది.  ధాన్యరేఖవుంది. ధనరేఖవుంది, మీలోకొచ్చేవుంది.  ఏమినచ్చెనని అడిగారు మీరు.  అదే మంచిఆలోచన. ఒక జంగంవచ్చినా, ఒక జోగివచ్చినా, ఒక ఫకీరువచ్చినా యిద్దామని మనస్సులోకొచ్చివుంది.  ఇదిగో హుస్సేన్ బారాబాహి మాం. ఒక రాత్రి నాకు పీరు కనిపించాడు.  నాటినుండి తిననివ్వరు, ఆకలి కానివ్వర్, దేశదేశాలంట త్రిప్పుతుంటార్.  జోస్యాలుచెప్పమంటారు.  వెండిముట్ట వద్దన్నారు.  రాగిపుచ్చుకోవద్దన్నార్.  బంగారమైతే పుచ్చుకోమన్నాడు. అంచేత మీరు బంగారం యిస్తే నాకభ్యంతరం లెదు తీసుకోవడానికి" అని ఆసతో మాటాడుతుంటే ఆతెలుగు యాసకూ అంతర్గతమైన అతనికోరిక చెప్పేతీరుకూ నవ్వువస్తుంది.
         *వైష్ణవగురువు, శిష్యుడు వేషాలు
    వీరి సంభాషణలు విజ్ఞానాత్మకంగా ఉంటాయి. మచ్చుకుకొన్ని - 

శిష్యుడు: గ్రామంలో గాలిగోపురంపెద్ద, జంతువులలో నందిపెద్ద.,
           మృగములలో ఏనుగుపెద్ద, వృక్షాలలో తాళవృక్షంపెద్ద.


  • కూచిపూడి యక్షగానసాహిత్యంఉ సంప్రదాయము ప్రయోగము" నుండి.

డా|| చింతా రామనాధం.