పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/369

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుండా తనదగ్గరున్న బటానీలు అతనికిపెట్టికూడా రమ్మని బతిమలాడుతాడు. ఇక్కడ నటనంతా బలేతమాషాగా ఉంటుంది.

   తరవాత తండ్రి చిల్లరకొట్టుమీద కొలికిముతాన్ని కూర్చోబెట్టి ఇంట్లోకి భోజనానికి వెడతాడు.  పంచదారసీసాలోకి చీమలు ప్రాకుతుండడం చూస్తాడు.  మిరపకాయల డబ్బామీద చీమలు లేవు - వెంటనే ఆలోచించి చీమలుదులిపేసి పంచదారసీసామీద "మిరపకాయలు" అని రాసి చీటి అంటిస్తాడు.  తండ్రివచ్చి ఇదేవిట్రా అంటే చీమలుపట్టకుండా మిరపకాయలని రాసేనంటాడు.  ఇలాంటి ఎన్నో విషయాలు కడుపుబ్బ నవ్విస్తాయి.  ఇది బలభద్రపురం వెంకటరెడ్దిగారు ప్రసిద్దిగా వేసేవారు.  ప్ర్రారంభంనుంచి ముగింపువరకూ ప్రేక్షకులు అలానవ్వుతూ ఉండవలసిందే.
               "గు రు వు - గొ ల్ల" వే షా లు

వీళ్ళసంభాషణ గొప్పచమత్కారేంగా ఉంటుంది ఇలాగ -
గొల్ల: బాబూ! మిమ్మల్నే వనిపిలవాలి?
గురువు: మమ్మల్ని నువ్వు ఏవండి అనాలి. నిన్ను నేను ఏవిరా అనాలి
           తెలిసిందా?
గొల్ల: ఆ తెల్చిందండి. మమ్మల్ని నువ్వు ఏవండీ అనాలి. నిన్ను
       నేను ఏవిరా అనాలి. అంతేగదండీ!
గురువు: కాదురానాయనా!
గొల్ల: కాకపోవడమేటయ్యా. ఉప్పుడు నువ్వన్నమాటేగదా! పోనీ
       కాకెక్కువా బేమ్మడెక్కువా చెపు.
గురువు: వర్ణానాం బ్రాహ్మడే ఎక్కువ.
గొల్ల: మరైతే సచ్చిపొయినోళ్ళకి గతులుకోసం నుదురుమీద కూడెట్టి
      కాకి ముట్టాలంటారుగానీ బేమ్మడుముట్టాలంటారా? అందుకే
      బేమ్మడుకంటే కాకే ఎక్కువంటాన్నేను. అదిసరేకాని జంతు
      వుల్లో ఏది సెండాలజంతువో సెప్పు. (చండాలం)
గురువు: గాడిదరా.
గొల్ల: గాడిదెక్కువా? బేమ్మడెక్కువా?
గురువు: బ్రాహ్మడేఎక్కువ.