పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/371

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

           పక్షులలో రాబంధుపెద్ద, భూమికి పర్వతంపెద్ద, తమరు
           మాటపెద్ద-కదూస్వామీ !
గురువు: కాదునాయనా! పెద్దలువేరేఉన్నారు. పరమభాగవతులు.
           మాతృద్రోహి, పితృద్రోహి, భాత్రుద్రోహిల్, తదైవచకుల
           ద్రోహి, వంచైతే వీరవైష్ణవా!
శిష్యుడు: అమ్మబాబోయ్ - మాఅమ్మా, నాయనా, అన్నా, కులమూ
           పదికాలాలపాటు చల్లగాఉండాలంటే మీవద్ద శిష్యరికం
           మానేసి వెళ్ళీపోతానుగాని యిటువ్ంటిబోధలు వినలేను
           స్వామీ. మీకు వేయినమస్కారాలు.
గురువు: కంగారుపడకురాశిష్యా నేచెప్పేదివిను. మాతృద్రోహిఅంటే
           తల్లినిచంపినవాడు - పరశురాముడు. పితృద్రోహిఅంటే తం
           డ్రినిచంపినవాడు. ప్రహ్లాదుడు. భ్రాతృద్రోహిఅంటే అన్న
           ను చంపినవాడు- విభాషణుడు. కులద్రోహిఅంటే కులమును
           నాశనం చేసినవాడు - ధర్మరాజు. వీరేగదరా మనపెద్దలు?
   

  ఇలా విమర్శనత్మకంగా ఎన్నోవిషయాలుమాట్లాడతారు.  యీ గురుశిష్యులు.
 
      ఇక సోమయాజులు, సోమిదేవమ్మ, చాకలి, అనుమానపుభర్త వేషాలలో బండెడు హాస్యం పొంగిపొరలుతుంటుంది.  ఇవేగాక త్రాగుబోతువేషంలోనూ,  ముష్టివాడివేషంలోనూ సమాజంమీద ఎన్నో విసుర్లతోపాటు హాస్యజనకమైనపాటలూ, మాటలూకూర్చూని ప్రదర్శిస్తుంటారు. ఈ కామిక్ వేషాలమాటలు నిర్జీతమైలేవు.  నటునిబట్టి, అక్కడిపరిస్ధితినిబట్టి మారుతుంటాయి.  కొందరు ఊళ్ళోవిషయాలను ముందుగా సేకరించి అవికూడా కలుపుకొని మాట్లాడడం కద్దు.  ఆవూరివిషయమె హాస్యంగా వాళ్ళకళ్లముందుకు తెస్తే మరీమాజాగాఉంటుంది.  ఒక్కోసారి అసలు నాటకంకంటే యీ స్పషలువేషాలే ఎక్కువ మన్ననపొందుతుంటాయి.,