పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/352

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేమో, కడిమిచెట్టుక్రింద గొయ్యితియ్యండి. ఆగోతిలో నన్నువాటిపైన కడిమిఆకులుకప్పి వెళ్ళండి" అంది. వారు ఆవిధంగాచేసి వేటకెళ్ళేరు. ఇప్పుఫు వెంకన్మ మామూలురూపంలోనికివచ్చేది చెట్టమీద నుంచి క్రిందకురికాడు. కడిమెఆకులు కాళ్ళతోతన్నేడు. అవి కాళహస్తి పాయనుఇ కలుసుకున్నాయి. గోతిలో బూబమ్మనోరు మూసి "నన్నంటరదన్నావు- ముట్టరాదన్నావు- ఘోషాచిన్నదాననన్నావు- ఇప్పుడేం చేస్తావ్" అంటే బూబమ్మ గోతిలో మిడిగుడ్లుచేసిచూస్తోంది. అతను పైకి లేవదీసి ఏడుకొండల్లోకి ఎత్తుకుపోయాడు. గుడిలోకి ఎవరూరాకుండా రాగితలుపులు వేసేశాడు - వెండితలుపులు విడిరాకుండా వేశాడు. కంచుతలుపులు కదలకుండా వేశాడు. గుళ్ళోబూజమ్మ ఘొల్లుమంది. అదిచూసి వెంకన్న ఓదార్చబోతే నాఅన్నల్ని ఎప్పుడుజూస్తానంటూ ఏడవసాగింది. ఇకలాభంలేదని పాంచాలి ఫకీరును తీసుకువస్తానని మూడుపోగులజందేం ముందుకేసుకుని, రాగిబుడ్డిముంత చేత్తోపట్టుకుని, అరిగినగంటం, చిరిగిన పుస్తకం చంకపట్టుకుని జేబులో చిటికెడు విభూతి వేసుకుని బయలుడేరివెళ్ళి గుమ్మందగ్గరకూర్చున్నాడు.

 అక్కడ కడిమిచెట్టుక్రిందకువచ్చిన అన్నఫకీరు గోతిలో చెల్లెలులేక పోవటంతో ఉగ్రకోపిఅయినాడు.  కళ్ళు ఎరుపెక్కేయి. "ఇది వెంకన్న పనే - వాడి అద్దాలగుళ్ళు బ్రద్దలుకొడతాను. ఈదెబ్బకు వాడిగుళ్ళన్నీ దద్దరిల్లుతాయి - ఆగుళ్ళన్నీ నాగలోకంవెళతాయి" అని గుడివేపుకు వస్తుంటే వెంకన్న ముసలిబ్రాహ్మణునిలా ఎదురెళ్ళాడు.  ఈముసలిబ్రాహ్మణ్ణి ఏమన్నా అంటే పాపంఅని వారూఅతనికిదారిచ్చారు.  వెంటనే వెంకన్న దారట్టుకెళ్ళినట్టేవెళ్ళి జేబులోని విభూతితీసి గుప్పెడు చల్లేడు. వారు జోడుబోడిగుళ్ళయ్యారు.  ఆబోదిగుళ్ళనుదెచ్చి బూబమ్మకు చూపి "ఇదుగో నీ అన్న గార్లు - ఏడవకే" అన్నాడు.  వారిని బంగారపుకోనేట్లో స్నానమాడించి చూసాడు.  అప్పుడు ఆమె దు:ఖంమానింది.  వెంకన్న అన్నంవండమంటే సామానుతెమ్మంది.  వెంటనే కుమ్మగొల్లయ్యను కేకేశాడు.  ఏడుకుంచాలబియ్యం బానతెమ్మన్నాడు.  చాకలి సర్వయ్య వచ్చాడు.  బజారుకెళ్ళొచ్చి బియ్యంతెచ్చేడు.  ఆమె బియ్యంలోని వడ్లు, బెడ్లు ఏరకుండానే బియ్యంబుట్టలోపోసి బంగారుకోనేర్లో ఒక ముంచుముంచి ఏడుకుంచాలకు ఎసరెట్టి అందులోపోసింది.  అది ఉడికిందొకమెతుకు ఉడకందొకమెతుకు - దాన్ని చల్లారబోసింది. బంగాళా