పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/351

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జందెం ముందుకెసుకొని, అంగవస్త్రంకట్టి, వొళ్ళంతా విభూతిపూసుకుని, తులసితావళములు ధరించి, చేతితో సితారుమీటుతూ ఆమెవదగ్గరకెళ్ళి "ఓచిన్నదానా! ఈఅడవిలో ఏముంటావు? నువ్వు ఆదదానివికావా? భయంలేదా? ఈపులులు సింహాలు నిన్నుతినెస్తాయి. ఈ బండరాళ్ళమీద ఏముంటావ్? అదిగో అదేనాఅద్దాలగుడి. అటుచూడు. నాతోకూడా వస్తావా? బంగారుతీగలు నీమెడలోవేస్తా. పట్టుచీరలిస్తా, నిన్ని రాణీనిచేస్తా- నేరాజునౌతా. నాబంగారుకోనేట్లో స్నానమాడిస్తా. భక్తుల బుర్రలు గొరిగించి దక్షిణగా చేస్తా, ఇకమ్ందు ఇదిపెద్దతీర్దేమవుతుంది. వాలుజడలవాళ్ళు మంగచుట్టాలు. బోడిగుళ్ళన్నీ నీకుచుట్టాలు. నీకు నొళ్ళంతా వజ్రదేహముచేస్తా రా.... అంటుంటే దానికి బూచి అలాంటి ఆశలెంవద్దని సొమ్మంటూ "నేనుఘోషాచిన్నదాన్ని. నన్నంటుకోరాదు. నా అన్నలు పాంచాలి ఫకీరు వస్తే నిన్ను నిలబెట్టి ప్రాణంతీసేస్తారు. పచ్చిరక్తంత్రాగే కసాయివాళ్ళు - నిన్నుబాకుతోను, బల్లెంతోనూ పొడిచేస్తారు. వారువచ్చేసమయమయింది. వెంటనే పో" అంది. దానికి వెంకన్న "నేను పోను. వాళ్ళు నీకు అన్నలయితే నాకు బాగలె - నిన్ను విడిచి నేను నిముషముండలేను" అంటుండగా వరువచ్చారు. వేయిమాయలవెంకన్న జాతికొంగ అవతారంఎత్తి ఆచెట్టుపైఉన్నాడు. అల్లంతదూరాన అన్నల్ని చూసినబూబి బులిబులిదు:ఖాలుతీస్తూ కూర్చుంది. వారు చెల్లెల్ని "ఏవమ్మా? ఎందుకేడుస్తున్నావు? ఈఅర్ధానపడవి? అవరైనా వచ్చారా? నీకి అమ్మజ్ఞాపకం వచ్చిందా? బాబు జ్ఞాపకంవచ్చాడా? నీకు వస్తువులుకావాలా? సొమ్ములుకావాలా? నాతొ చెప్పు చెల్లెమ్మా"అని సముదాయిస్తుంటే చెల్లెలు అన్నతో చెప్పిందియిలా. "నల్లనల్లనివాడు. నామాలుకలవాడు. నన్నుదుర్భాషలాడి వెళ్ళేడు." అనగానే అన్నకోపంతో వడేమన్నాడు? అనవళ్ళేమిట్యి?" అని గద్జించాడు.

  దానికామె "అతనివొళ్ళంతా వజ్రదేహం. ముఖానముత్య కనబడుతోంది" అంది, దానికాతడు అర్ధచేసుకొని "అతడు పేరిందేవికుడుకు, పేరి వంకన్న. మేము కలిసి చదువుకున్నాం. మాపేరుచెబితే నీదగ్గరిఅకు రాడులే.  నీకు భయంలేదులే"అన్నారు,
   మరుసటిరోజు వేకునను మరల అన్నలు వేటకేడుతుంటే చెల్లెలు "నిన్న వచ్చినవాడు మళ్ళీ వస్తాడు.  నన్నిలాగ వదలివెడితే మీకుదక్క