పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/350

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మా యిళ్ళకు మేము వెళుతున్నాము" అని వెళ్ళీపోయారు. ఇదితెలిసిన గోవిందరజు భార్యతో "విన్నావాలక్ష్మి:-మాతమ్ముడు వెంకన్న దేవుడయ్యాక, నేనెళ్ళి చూసొస్తానని ఏడుకొందలపైకివెళ్ళాడు. ఇక్కడ బేరగాళ్ళుపోసిన కాసులరాసులు చూశాడు. పనసపాడువెళ్ళీ పనివాళ్ళను తెచ్చి తమ్ముడు వెంకన్నకు గుళ్ళుకట్టమన్నాడు. వాళ్ళు బజారుకెళ్ళారు. బంగారం తెచ్చారు. శంకుస్థాపనచేశారు. నల్లరాళ్ళుతెచ్చి బాడితలతోచెక్కి మలుపులు తీర్చికట్టారు. మండపాలచుట్టూ సున్నంతో కట్టిన గోడలప్రాకారాలు తీర్చారు. గుడికట్టి గుడిమీద శిఖరాలు పెట్టేరు. పైన పసిడికుండపెట్టారు. ఎదుట గరుడస్థంబాలెత్తారు. ఏడురోజులు మధ్యాహ్ననికి గర్భగుడికట్టారు. ఆగుడిలో వెంకన్న ప్రతిమనుంచారు. పనిజరుగుతున్నంతకాలం చెల్లమ్మకోడలు గొల్ల అచ్చమ్మ పనివాళ్ళకు చల్లమోసేది! ఆపని అయిపోయింది. పనసపాడుపనివారు వెళ్ళిపోతూ "నీచేతి ఫలహారానికి ఋణపడి ఉన్నాము, వెళ్ళిపోతున్నా"మని చెప్పుతుంటే గొల్ల అచ్చమ్మ వారిని తనపేరుమీద గర్భగుడికెదురుగా మండపంకట్టమని కోరింది. అప్పుడువారు "నువ్వుముందుచెప్పలేదు, ఉన్న సొమ్మంతా అయిపోయింది, ఇక ఏంచెయ్యగలం?" అన్నారు. ఇదివిన్న గొల్లాచమ్మ "ఓ అన్నలారా! ఉలి, బాడిత అట్టుకొని నాతోర్ండని రాతి శిలలదగ్గరికి తీసికేళ్ళి తెగ్గొట్టమంది. అవితెగ్గొట్టగానే అందులో బంగారం 750 కాసులుంది. అమ్మగరింటికెళ్ళి 200 తెచ్చింద్సి. ఈ 250 తీసుకొని వెళ్ళీ బాడితలతో బందరాళ్ళు చెక్కేరు. మండపంకట్టి గర్భగుడి ఎదురుగా గొల్లాచ్చమ్మ పేరువేశారు. ఆడకోతుల్ని మొగకోతుల్ని వేశారు. కోతులకోనలాతయారయ్యింది. ఇక ఏవేపుచూసినా ఎవరూ కనబడరు.

  ఇదిలావుండగా ఆప్రాంతాన ఒకపల్లెలో బూలమ్మపుట్టింది.  బూలమ్మ పుట్టగానే తల్లిదండ్రులు చనిపోయేరు.  ఆమె అదిగింది.  అప్పుడు ఆమె అన్నలు పాంచాలి ఫకీరు ఆమెనుతీసుకొని ఆవూరు వదలి అర్ధానపడివికి వచ్చారు.  కడిమిచెట్టుకింద మకాంపెట్టి ఉన్టెలు సట్టలు చెట్టుకికట్టేరు.  అదే మువ్వంవారితోట.  చెల్లెలిని అక్కడ ఒంటరిగావుంచి పాంచాలి ఫకీరు వేటకెళ్ళీ ఏపూటలాపూట శేరుబియ్యం, కొట్టినపిట్టమాంసం తెచ్చి యిస్తుంటే ఆమెవండిపెడుతుండేది.  ఈతోటలో కన్నేశాడు వేల్పావెంకన్న.  ఒకరోజు తెల్లవారగట్టే పాంచాలి ఫకీరు వేటకెళ్ళీన సమయంచూసి మూడుపోగుల