పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/353

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దుంపపోపెట్టింది. చితుకుచితుకు చింతకాయకూరొండింది. మొత్తం ఏడుముద్దలు చేసి వెంకన్నను పిలిచి "నీకు కానికూడుదొరికింది కడుపునిండా తిను" అంది. తొలింద్ద, మలిముద్ద, మూడు నాలుగు ముద్దలుతిన్నాడు. అయిదోముద్దదగ్గరుంది. "మరి నాఅన్నగార్లను నేను మరచివున్నాను. నువ్వు మంగదగ్గరకూడా అలగే మరచివుండాలి. అలావుంటానని చేతిలో చెయ్యివెయ్యి" అంది. దానికతడు "తీర్ధాలు యాత్రలు ఇక్కడ సాగుతాయి, ఏడుకొండలకొచ్చినవాళ్ళ బుర్రగొరిగించి కొండదింపుతాను. వచ్చేవాళ్ళువస్తుంటారు - వెళ్ళేవాళ్ళు వెళుతుంటారు. వాలుజడలవాళ్ళు మంగతుచుట్టాలు, బోడిగుళ్ళవాళ్ళు నీకుచుట్టాలు" అని చెప్పబోతుంటే మటల్లొపెట్టి అసలుసంగతి మరిపించకని తానడిగినదానికి సమాధానం సూటిగా చెప్పమంది. ఇంతల్లో మంగను తెస్తానో తేనో నేను చెప్పలేను అన్నాడు.

   ఇక అక్కడ మంగమ్మకు 18 సం||లు వయసొచ్చింది.  మంగ వెండిమొందిచేట, దొడ్దికర్ర, చంకన ఇత్తడిబాల్చీ, జాలారిబొమ్మలతోతోటిపిల్లలతో ఆడుతోంది. ఆటలలో ఆవుపాలుతీసి అన్నాలువండి బాలలకు వడ్డిస్తొంది.  లక్కపిడతలుపెట్టి గుజ్జనగూళ్ళాడుతొంది.  అంతలో ఒకపిల్ల ప్రకపిల్లతో అన్నదిగదా "పెద్దక్కా! నివ్వావా? మంగమ్మ మొగుడు తుర్కకూడుతిని దుష్టుడయిపోయాడు.  కులభ్రష్టుడయాడు" అంది.  దానికి ప్రక్కపిల్ల ఆమాట మంగకు చెప్పొద్దంది.  మరొక కొంటెపిల్ల మంగమ్మఏడిస్తే ఎలాగుంటుందోచూద్దాం - చెప్పుదామంది.  దానితో వారంతా మంగతో యీవిషయంచెప్పి నీకొసం యికరాడని, నిన్నేలడని చెప్పేసారు.  ఈ మాటవిన్నమంగమ్మ ఆనాడే ఆటచాలించిది.  పుట్టింది మొదలు తండ్రిగదిలోనికి అడుగిడనిమంగ విసురుగా తండ్రి గదిలోకి పరుగులుతీసింది.  మంచంమీదకూలబడింది.  మువ్వల దుప్పటి ముసుగుపెట్టింది.  ఘొల్లుమని గోలెట్టసాగింది.  ఈ సంగతితెలియని ఇసుదేవి వెందిగిన్నెలో వెన్న,పైడిగిన్నెలో పాలు పట్టుకుని ఆడడానికి వెళ్ళిన మంగకోసం ఎదురుబయలుదేరింది.  ఎక్కడా మంగకనబడలేదూ ఆశమ్మను పోశమ్మను అడిగింది.  "మీపిల్లలతో మంగఆడుతోందా" అని వాళ్ళు లేదన్నారు.  మాపిల్లలతోరాలేదన్నారు.  ఆమెవీధివీదీ తిరిగింది.  జాడ తెలియలేదు.  ఇంటిలొ ఉందేమో వెతకమన్నారు.  తన ఇల్లు