పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/341

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త రం గా లు - కీ ర్త న లు

   మధ్యకాలంలో 'తరంగాలు ' కూడా చేరాయి కాలానుగుణంగా, 'విననెవల్లన మృదుచరణా ' వంటి అధ్యాత్మ్యకెర్తనలు, 'సుజన జీవనరామ సుగుణ భూషణ ' వంటి త్యాగరాయ కీర్తనలు దేవతాప్రార్ధన అనంతరం చోటుచేసుకున్నాయి.  అలాగే అభినయభాగంలో "దీరసమీరే యమునాతీరే" వంటి అష్టపదులు, 'బ్రూహి ముకుందేతి ', 'బాలగోపాల ' వంటితరంగాలు అనువదించబడ్డాయి.  ఈ కాలంలోనే ప్రవేశించిన మరో అంశం "సలాందరువు".ఇది ఏ ఇతరనాట్యాలలోనూ లేదు.వీరి స్వంతం. ఇది చేస్తున్నప్పుడు ప్రతివాడూ మైమరచి కళ్ళపగించి చూడవలసిందే.  దీనికి సాహిత్యంలేదు.  వాయిద్యసహకారంతో అభినయించే నృత్యప్రహెళిక.  దీనినె "గప్తు" అంటారు.  దీనిలోకోలా సుబ్రహ్యణ్యం ప్రసిద్ధులు. "అరిపరివిధముల ప్రహ్లాదుదుమిము హరిహరిహరియని మరిమరి వేడగ" అనే దశావతార విన్యాసం దీనికిముందు పెడతారు.  ఇది యించుమిందు "ముక్తాయింపు" దరువుకూడా.  ఈ కాలంలోనె "కారువా", "జడకోపు" అనేవి కూడా ప్రవేశించాయి.  "కారువా అంటే ఒక ఆడవేషం, ఒక మగవేషం (రాజు, రాణులులాగ)వేసుకుని వచ్చేవారు ఆ సానులలో ఇద్దరు.  వారి వచనం, పద్యం, సంభాషణ, అభినయం చూపరులకు చోద్యంగాఉండేది.  "జడబోవు" అంటే ఒకామె తలవిప్పుకొని మధ్యఉంటే మిగతావారంతా అడుగులువేస్తూ చుట్టూ తిరుగుతూ చక్కగా ఆమె జడ అల్లేసేవారు.  అది చూడ్డానికి గొప్ప "త్రిల్ గా" ఉండేదట.  స్వాతంత్రోద్యమంలోకూడా వీరి పాత్రేమీ తక్కువకాదు.  "మరుఫకుండార్యులారా పంతాలు వధ" వంటి కీర్తనలతో సభికుల్ని ఉత్తేజితుల్ని చేసేవారు.
         రెం డ ర్ధా ల పా ట లు
 1950 నుంది ఆధునికకాలం అనుకుంటే ఈకాలంలోచేరినవి "సారాబుడ్ది చంకంబెట్టి", "చూడు పిన్నమ్మా పాడు కుర్రాడు", "పచ్చబొట్టు పొడిపించుబావా?, "తగులుకుంటెరాదోయి తాళంకప్ప" ఆటలో వాలు మొగ్గవేసి క్రిందనున్న సూదిని కనురెప్పతో తీయడం, వాలుమొగ్గమీద నెనక్కి వంగి నాలుకతో నేలమీదిరూపాయిలుతియ్యదం, పళ్ళెంలో నీళ్ళు