పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/340

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వీరి పాండిత్యం పూర్తిగా వెల్లడయ్యేది ఇందులోనే సిద్ధహస్తులైన విదుషీమణులు మోకాళ్ళమీదా పద్మాసనంమీదా కూర్చొని పదాలూ, వర్ధాలూ, జావళీలూ పాడుతూ అభినయం పడుతుంటే కూర్చున్న పండితులు ఓహ్ ఓహ్ అని తన్మయులైపోయేవారు.

  తొలుత "పాలయగజవదనా" వంటి ప్రార్ధన, "ఆపుఇసెదాజీకేమగువా" వంటి దేవతాప్రార్ధన, కీర్తనలు స్వరఆలాపనచేస్తూమధురంగా పాడి తమ సంగీత పాండిత్యాన్ని ప్రదర్శించేవారు.  తరువాత విదుషీమణి ముందుకువచ్చి "సామీ దయరాదేమిరా" వంటి పల్లవి పాడుతూ అభినయం పట్టడం ప్రారంభించేది.  క్రమంగా 'భైరవి 'లోగాని,"బేగడ"లోగాని 'చెక్' వర్ణాలు 'నీసాటిస్వామీ ' (బేగడ) వంతివి అభినయంపడుతుంటే పండితులు మళ్ళీమళ్ళీ పట్టించి తాంబూలాలలోరూపాయల వర్షం కురిపించేవారు.  "సామీనీరమ్మనెరా ఆచెలి, దాని సాటి ఎందులేదు" అని క్రీగంటిచూపులతొ కనుబొమ్మలెగరేస్తూ పాడుతుంటే పరవశంపొందని వాడెవడు!
                నా య కీ  భా వం
 "నాయకీభావం" వీళ్ళసొత్తు.  పదాలలో "ఇల్లెరుగక మారీ ఒకరింటికి వచ్చితివా, ఎవరోయీ నాయకుడా" అనే ప్రౌఢనాయిక, 'ఏరీతిబొంకేవురా లేదనీ నాతో ' అనే ఖండిత నాయిక, 'సుదతూలందరూగూడి శోభనమని అంటే అదిఏమో అనుకొంటినే ' అనే ముగ్దనాయిక, "పోయీవచ్చెద సామీ- అత్తింటికి పొయీవచ్చెద" అనే పరనాయికాభినయాలకు వీరు పట్టేతీరు మనోహరం. బహుశ: మరేనాట్యసంప్రదాయంలోనూ ఇలా కూర్చబడలేదేమోకూడా.  శాస్త్రంతెలియని పామరుదుకూడా 'శభాష్ ' అని తీరవలసిందే.  ఆతరువాత 'నమ్మగరాదె కొమ్మ మగవారల ', 'ముద్దుపెట్టరా ఒకముచ్చటాడిపోరా ', చీటికి మాటికి ఏటికి కోపము ', 'మరుబారికి తాళ లేను ' వంటి జావళీలకు హస్తం, ముద్రలు పడుతూ మదనతాపం ప్రకటించే తీరులో ఉద్భవించే శృంగార రసోత్పత్తిని రసగంగాధరుదుకూడా అక్షరాలలో నిక్షేపించలేడు.  ఆ అభినయం ఆ హావభావాలు పుస్తకాల్లో ఇమడ్చడానికి కావ్యాలంకార సంగ్రహకర్తకుకూడా సాధ్యంకాదేమో!