పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/342

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పోని అవి వొలక్కుండా పళ్ళెంఅంచులపై నాట్యంచేయడంవంటి ఫీట్సు చేసి సభికుల్ని చకితుల్నిచేసేవారు. కోటిపల్లి నరసింహాయి పచ్చిబండ మీద చేసే నాట్యం పిచ్చెక్కించేదట. ఈ కాలంలో బేర్ డ్యాన్సుల వంటి నృత్యాలతోపాటు సర్పనాట్యంవంటి జానపదనాట్యంకూ'డా ప్రసిద్ధి పొందింది.

    ఆదిలోఈ కళావంతుల నృత్యాభినయాన్నీకర్నాటకఫ్విద్య" అనెవారట.  తూర్పుగోదాఫరిజిల్లాలో మండపేట, మురముండ్ల, అమలాపురం, తాటిపాక, పెద్దపురం, పిఠాపురం,రాజమండి, కాకినాడలలోనూ పశ్చిమగోదావరిలో దువ్వ,రేలంగి, ఇరగవరం, అత్తిలి, భీమ్మవరంలోను భోగంమేళాలు ప్రసిద్ధిగా ఉండేవి.  ప్రభుత్వనిషెధంవల్ల నెడు ఇది దాదాపు క్షీణదశచేరుకుంది.  చరిత్రపరంగా ముందుతరాలవారి కోసం దీనిని మ్యూజియం వస్తువుగానైనా రికార్టుచేసి ఉంచడం మన కనీస ధర్మం.
                           కో ల సం బ రం
  • కృతాసత్యస్వరూపశ్చ, త్ర్రేతాయాం రఘునందన:

   ద్వాపరేవాసు దేవశ్చ, కలేచాలు వేంకటనాయక;

  ఆంధ్రదేశంలో ప్రసిద్ధమైన దేవాలయాలు అడుగడుగునా అనేకం కనిపిస్తాయి.  వీనిపై పురాణాంతర్గతమైనకధలు ఒకవైపునా, చారిత్రాత్మకమైనగధలు మరొకవైఉనా, జానపదులనోళ్ళలో వేరే కధలూ ప్రచారంలో ఉన్నాయి.  ఉదాహరణకు తిరుపతి వేంకటేశ్వరస్వామి కధ తీసుకుంటే పద్మపురాణంలోచెప్ప బడ్డకధ స్తూలంగా యిలావుంది.
  వైకుంఠంలో భృగుమహర్షి విష్ణువు వక్షస్థలంమీద తన్నడం,దానికి లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వచ్చేయడం,ఆమెను వెదుక్కుంటూ విష్ణువు రావడం. వకుళాదేవిని పెండ్లాడడం, తిరుపతిలో కలియుగ దేతలుగా నిలిచిపోవడం అనేది గ్రంధస్థమైన కధ.
  ఇది చారిత్రాత్మకంగాచూస్తే వీరశైవ, వీరవైష్ఠవ పోరాటాలలో రామానుజాచార్యులు తిరుపతికొండపై యీ విగ్రహాలను ప్రతిస్ఠ్జించడం, కృష్ణదేవరాయలు వగైరా రాజులు వీనిని దర్శించి, సేవించి. పెంచి పోషించడం మనకు కనిపిస్తుంది.