పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

మంగళసూత్రాలకు నల్లపూసలు, పుస్తెకంటు వీరిచేత కట్టించేవారు మంగళకరమని. వీరికి దేవాలయ మాన్యాలుండేవి.

తరువాత తరువాత వీరికళ దేవస్థానాలనుంచి రాజాస్థానాలకు మళ్ళింది. రాజుల సమదరణకూడా బాగానేఉండేది. క్రమంగా జమీందారుల కౌగిళ్ళలో నలిగినలిగి, శ్రీమంతులచేతుల్లో చితికిచితికి పతితజాతిగా పతనమైపోయింది. ఆరోజుల్లో ఎంత సత్సీలత! కళే సర్వస్వం. వీరిలో 'కన్నెరికం ' అనేదికూడా కళాత్మకంగానే జరిగేది. అంతా 'శోభనం'తంతే. అరోజునుంచీ అతనిక్రిందే ఆమె. అంత నిజాయితీ. ఉంపుడుగత్తెల నుంచుకోవడం ఆరోజుల్లో అదోగొప్ప. ఫలానావారితాలూకుఅంటే పేరు. ఆమెను స్వంతభార్యకూడా చెల్లెలిగా చూసేది. పండుగ పబ్బాలలోనూ, విందులు వినోదాలలోనూ కలిసిమెలిసి తిరిగేవారు. ఒకసారి ఒకాయన భార్యాసమేతంగా తరలివచ్చి ఒకామెకు కన్నెరికం చేస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. తరువాత తెలిసింది ఈపనికి ఆభార్యకూడా ప్రోత్సహింద్చిదని. ఎందుకంటే ఓపెద్దజొస్యుడు అతనికి ద్వికళత్రయోగముందని చెప్పాడట. ఈ గండంనుంచి తప్పించుకొవడానికి ఇదొక్కటే మార్గమన్నాడట. (ఆయనేఅన్నాడో ఈయనే అనిపించాడో!)

సానుల మేళాలకు, కళావంతుల మేళాలకు తేడా ఒక్కటే. కళావంతులు "కలాపాలు" చెయ్యరు. సానులు "గొల్లకలాపం", "భా మాకలాపం" కూడా చేస్తారట. భోగంమేళాలముందు ఒకనాడు రసికులూ తరువాతికాలంలో సరసులూ చేరేవారు. నేటికాలానికిది కాముక కళగా మారింది. ఆనాడు ఊరేగింపులో ఇద్దరుగానీ నలుగురుగానీ సానులు ముందుకొచ్చి నాట్యంచేస్తుంటే మిగతాసానులు వెనుక దడిలా నిలబడి పాడుతూ, తాళంవేస్తూ రాత్రంతా ఊరు తిరిగేవారు.

“మే జు వాణీ”

వీళ్ళ ప్రసిద్ధి మేజువానీ - దీనిని 'సభ' అనేవారు. [1]"ఇది ఉర్దూ మేజుబానీ"నుండి వచ్చిన పదం - దీనికి ఉర్దూలో 'విందు' అని అర్దం.


  1. ఆంధ్రుల సాంఘికచరిత్ర - 7వ ప్రకరణం పు.409 (సురవరం ప్రతాపరెడ్డి)