పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/338

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మీ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటని వృద్ధకళాకారిణి కోటిపల్లి రాజరత్నంను అడిగినప్పుడు ఆమె గతకాలాన్ని నెమరువేసుకుంటూ కళావంతులు రంభ వంశంవారనీ, దొమ్మరసానులు ఊర్వశివంశంవారనీ తమ పూర్వులు చెబుతుండేవారన్నది చిరునవ్వుతో. ఈమె కవికుల గురువులు శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి శిష్యురాలు. పలుకులో ఎంతో పాండిత్యం ఒలుకుతుంది. పరిశుద్ధమైన భాష. సంగీతంలో నిధి. సంస్కృతం నేర్చుకుంది. శ్రీ శాస్త్రిగారిదగ్గర 200 శ్లోకాలు అభినయానికి వీలుగా అర్ధవివరణతో చదివిందట. "అభినయ దర్పణం" ఆపోసన పట్టేసింది. "రసమంజరి" ఆమె రసనాగ్రాలమీద నాట్యంచేస్తోంది. "నేనేకాదు ఆకాలంలో మావాళ్ళందరూ అంతే. కనుకనే ఆరోజుల్లో మేము పదానికి అభినయంపడుతుంటే పండితులంతా వళ్ళుమరచి తాళంవేస్తూ తలలాడించేవారు. నర్తకీ, సభాసదులూకూడా ఆ రససముద్రం లో ఓలలాడేవారు. ఒక్క వర్ణం ఫట్టేటప్పటికే తెల్లవారేది. ఎక్కడ ఏ హస్తం పట్టాలనేది ఆనాడు సామాజికులకుకూడా బాగాతెలుసు. అందుకే ఆసభ సప్తాంగ లక్షణాలతో రాణించేది" అంది.

  మరి ఇప్పుడో? అన్నాను. "ఇప్పుడా? జయమాలిని, జ్యోతిలక్ష్మి సెక్సుడ్యాన్సులే అడుగుతున్నారు ప్రేక్షకులు.  మాపిల్లలకు కూడా అంతకుమించిరావు.  ఇలా దిగజారిపోయింది మాకళ" అని ఆమె వాపోయింది.
                   దే వ దా సీ లు

            * సురడలి . . . . . . . .భూతలమిచ్చె
                     . . . .----దక్షవాటికావరునకు
                భీమనాధునకు వారవభూత్రిదశ స్యయంబుతొ"

   ఆదిలో వీరి కళాప్రదర్శన దేవాలయాలలో దేవునిఅర్చన విధులలో ఒకటి. ఉదయం, సాయంత్రంవీరు అభినయంపట్టి హరతి ఇవ్వడంతో ఆపూట అర్చన పూర్తయ్యేది.  అందుకే వీరిని దేవదాసీలనేవారు.  వీరి కుటుంబాలస్త్రీలను రజస్వలకాగానే దేవునిసేవకు కైంకర్యం చేసేవారట.  కాబట్టి వీరు నిత్యపుణ్యస్త్రీలు.  మొన్నమొన్నటివరకూ పెళ్ళిళ్ళలో

  • భీమేశ్వర పురాణం - శ్రీనాధుడు.