పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/324

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యేసుని బలియివ్వాలనిచెప్పి యెతనిని బలివేయించాడట. ఈ కధ చెబితుంటే బారతయుద్ధాన్ని గూర్చి అందరూ పునరాలోచనచేస్తాం. ఈఅనకు "హాస్యకళానిధి" అని పెనుగొండలో బిరుదునిచ్చి గౌరవించారు. పెద్దాపురంలో సింహతలాటం చేశారు.

37. రాఘవ బుర్రకధ దళం:-

    పెద్దాపురం. వ్యాఖ్యానం పోతాబత్తుల సత్యనారాయణ.  కధ శ్రీమతి లక్ష్మీకుమారి. హాస్యం ప్జోతాబత్తుల లక్ష్మీనారాయణ.  లక్ష్మీకుమారి సత్యనారాయణభార్య. లక్ష్మీనారాయణ గారి తమ్ముడు.  వీరు భారతదేశంలో అనేకపట్టణాలలోకధలుచెప్పేరు.  తాళ్ళరేవులో సువర్ణ హస్తఘంటాకంకణం సన్మానంపొందారు.  అనేకచోట్ల సువర్ణరజితవస్తు బహుకరణలు పొందారు.  పెద్దాపురంలో సువర్ణగిరి పట్టాభిషేకంపొండారు.  వీరుచెప్పేవి ఝాన్సీలక్ష్మీబాయి,బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం, దక్షయజ్ఞం కధలు.

38. సరస్వతీ బుర్రకధ దళం:-

   పెద్దాపురం. కధకురాలు శ్రీమతి కె.మణికుమారి.  వ్యాఖ్యానం శ్రీ. కె.బండేశ్వరరావు.  హాస్యం శ్రీ యం.రాము.  నర్తనశాల వీరాభిమన్య, బొబ్బిలియుద్ధం, అంబేద్కర్ వగైరా కధలు.  వీరు రేడియో కధకులు.  ఆంధ్రదేశంలోనేగాక అనేక యితర రాష్ట్రాలలోకూడా కధలు చెప్పి సన్మానాలుపొందారు.  ద్రాక్షారామంపోటీలలో వ్యాఖ్యాత ప్రత్యేక బహుమతి పొందారు.  వీరికి శ్రీ ఆనం లక్షమణరావుగారు సింహతలాటం బహుకరించారు.

39. దుర్గాభవాని దళం:-

పెద్దాపురం.  కధకురాలు శ్రీమతి కె.లక్ష్మి, వ్యాఖ్యానం శ్రీ గోరు వీర్రాజు, హాస్యం శ్రీ కె.సూరిబాబు.  బొబ్బిలియుద్ధం, సీతారామరాజు కర్ణ, రాజహంస, జవహర్ లాల్ వీరుచెప్పే కధలు.  జిల్లాస్థాయిలో రాజోలు తాలూకా అరవపాలెంపరిషత్ లో ప్రధమ బహుమతి పొందారు.  కొత్తపేటలో కె.సూరిబాబుకు సింహతలాటం బహుకరించారు.  రేడియో కధకులు.  ఇతరరాష్ట్రాలలోకూడా కధలుచెప్పి మెప్పులుపొందారు.