పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/323

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గించుకున్నారు. విశాఖలో మకాంపెట్టి కుటుంబనియంత్రణ ప్రచారానికి 'సుఖజీవనం ', 'పదండి ముందుకు ' మత్స్యకారులప్రగతి మొదలైన కధలు తానేవ్రాసి ప్రభుత్వపరంగా ప్రదారం చేస్తున్నారు.

34. శ్రీ వాణీగిరిజా బుర్రకధ దళం:-

పిఠాపుతం. (తూ.గో.) కధకులు శ్రీ కె.కనకరాజు, వ్యాఖ్యానం శ్రీమతి దమయంతి - హాస్యం శ్రీ కె. గంగరాజు, వీరు వీరాభిమన్య, బొబ్బిలియుద్ధం కధలు ప్రసిద్ధిగా చెబుతారు. నిడదవోలు అచ్యుతతామయ్యగారిబాణీ. కర్నాటక, మధ్యప్రదేశ్ లలోకూడా కధలు చెప్పేరు. సుమారు వేయి ప్రదర్శనలుచేసిన దళం. శ్రీ కనకరాజు, శ్రీమతి దమయంతి రంగస్థలనటులుకూడా - రేడియో ఆర్టిస్థులు.

35. పరాంకుశం రామానుజులు బుర్రకధ దళం:-

పిఠాపురం. (తూ.గో.) కధ రామానుజులుగారు, వ్యాఖ్యానం సుబ్బలక్ష్మిగారు. కృష్ణరాయబారం, బొబ్బిలియుద్ధం, నర్తనశాల కధలకు ప్రసిద్ధి. వీరిదికూ డా అచ్యుతరామయ్య గారి పద్ధతే.

36. జాతీయ బుర్రకధ దళం:-

పెద్దాపురం (తూ.గో.) కధకురాలు శ్రిమతి సత్యవతి. వ్యాఖ్యాత శ్రీ బ్రహ్మానందం, హాస్యం రాజ్యలక్ష్మి. కర్ణ, అభిమన్య, మణిమంజరి, మాధవవిజయం వీరి పేటెంటుకధలు. నాజర్ బాణీ, బెంగాల్, బీహార్, ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాలలోకూడాకధలుచెప్పేరు. రేడియోకధకులు, బ్రహ్మానందంగారు రచయితకూడా. పరశురాం, జయప్రద, మణిమంజరి కధలు వ్రాశారు. వీరు అభిమన్యకధలో అంతర్భాగంగా బర్బరీకుడు కధ చెబుతుంటే చాలా విచిత్రభావన కలుగుతుంది. ఘటోత్కచుని కుమారుడు బర్బరీకుడు, భారత యుద్ధం ప్రారంభానికిముందు పాండవ్లకు అండగా యుద్ధానికిబయలుదేరివస్తున్నారట. దారిలో కృష్ణుడు మారువేషం తో ఎదురొచ్చి ఎక్కడికెవెళునావంటే విషయం చెప్పేడట. మరి బాణాలు మూడేపట్టుకెళుతున్నావేమిటంటే ఈ మూడుబాణాలూ ఒకటి కర్ణుడుకోసం, రెండవది యావత్ కురుసైన్యంకోసం అన్నాడట - మరి మూడవదో అంటే అసలీ భారతయుద్ధానికి కారకుడైన కృష్ణుడికోసం అన్నాడట - దానితో కృష్ణుడరిపోయి ధర్మరాజుదగ్గరకొచ్చి భారతయుద్ధప్రారంభానికి ఒక