పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/325

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాగమణి దళం:-

 పెద్దాపురం.  కధకురాలు శ్రీమతి జంధ్యాల నాగమణి.  వ్యాఖ్యానం శ్రీ ఈగల అప్పారావు.  హాస్యం శ్రీ గోపాలం. బొబ్బిలియుద్ధం, సీతాకళ్యాణం పేటేంటుకధలు.  కధకురాలిమధురగాత్రం యీదళానికి వరం.

41. సూర్యకుమారి దళం:-

        పెద్దాపురం.  కధ శ్రీమతి పి., సూర్యకుమారి, వ్యాఖ్యానం మొదట శ్రీ గోరి అమరేశ్వరరావు.  తరువాత శ్రీ ఈకల అప్పారావు వగైరాలు. హాస్యం అల్లాడి రాము.  వీరికధలు వీర బొబ్బిలిం సీతారామరాజు, మహారధికర్ణ మొదలగునవి.  కధకురాలి కమ్మని గాత్రం ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణ.  ఆంధ్రాలోనేకాకుండా బెంగాలు, బీహారు, ఒరిస్సా రాష్ట్రా లలో కూడా చెప్పేరు.  రేడియోకధకులు.   సూర్యకుమారి చిల్లకొట్టు చిట్టమ్మ వేషానికి గొప్పప్రసిద్ధి.

42. కళాంజలి బుర్రకధ దళం:-

     పెద్దాపురం.  కధ శ్రీ జలగం మల్లికార్జునరావు.  వ్యాఖ్యానం చందన రామమోహనరావు.  హాస్యం శ్రీ మావూరి చంద్రరావు.  వీరాభిమన్య వీరి పేటెంటుకధ  ద్రాక్షారామలో శ్రీ చంద్రరావుగారి హాస్యానికి ప్రత్యేక బహుమతి యిచ్చేరు.

43. కోటేశ్వరరావు బుర్రకధ దళం:-

             పెద్దాపురం. కధకులు శ్రీ చందన కోటేశ్వరరావు, వ్యాఖ్యానం శ్రీ కుందుం భీమరాజు, హాస్యం శ్రీ దయింత్రి కనకలింగేశ్వరరావు.  వీరాభిమన్య, కృష్ణరాయబారం, బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం, సుబాస్ చంద్రబోస్ వగైరా కధలు చాలచక్కగా చెప్పేవారు.  నాజర్ గాని బాణీ, సందర్భానుసారంగా కధలో కధకుడు జాతీయ గీతాలు పాడుతూ ప్రత్యేకతను ప్రదర్శించేవారు.  వ్యాఖ్య్హాత గతాన్ని మేళవిస్తూ ప్రస్తుతాన్ని విమర్శిస్తూ గొప్ప వ్యాఖ్యాతగా పేరు పొందేరు.  కనకలింగేశ్వరరావు గారి హాస్యం అదో ప్రత్యేకతరహా.  చిన్న చిన్న బిట్టులతో కడుపుబ్బ నవ్వించేవారు.  దానాలలో ఒకదానం చెప్పరా అంటే గర్భాదానం అని చెప్పుతూ ప్రజల్ని పకపకానవ్వించేవారు.  సున్నితమైన రేఅజకీయ