పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/318

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10. బాబూరావు మాస్ఠారు దళం:-

      రామచంద్రపురం వీరిదిఅంతా జూనియర్ నాజర్ బీణీయే.  నాజర్ చెప్పే కధలతోపాటు సీతారామకళ్యాణం, వీరాభిమన్యు, మనుషులు మారాలి, వెలుగుబాట, బాలఏసు, కరుణామయుడు, ఝాన్సీరాణి, ఎర్రబాట కధలు చెబుతారు.  ఉత్సాహవంతమైన యువదళం.  అనేకచోట్ల బెంగాల్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాస్ట్య్రాలలో ఎన్నోకధలు చెప్పి ప్రఖ్యతిపొందారు.  పెద్దపెద్ధ పండితులచేత ఘనసన్మానాలు పొందారు.  వీరికి హాస్యం జుత్తుక సూరిబాబు బి.ఏ. వ్యాఖ్యానం నవీన్ కుమార్ బి.ఎ.బి.యిడి. సిలోన్ రేడియో కధకులు.   బాబూరావుమాష్టారు బుర్రకధాసామ్రాట్, బుర్రకధా సార్ఫభౌమ బిరుదుపొంది నాజర్ గారిచే సింహతలాటంచేయిఉంచుకుని  "బుర్రకధారత్నగా" బిరుదుప్రధానం పొందారు.

11. ప్రజానాట్యమండలి:-

    జంగారెడ్దిగూడెం. (ప.గో.) ఇదికూడా నాజర్ అడుగుజాడలలో పనించే బృందమే.  వీరి గ్రామరాజకీయాఉ యితివృత్తంగా చెప్పే "మనవూరికధ" ప్రత్యేకతగన్నది.  ఈదళంలో వ్యాఖ్యానంచేసే పూసల రజనీగంగాధర్ రచయితకూడా.  శ్రీ మారం సోమరాజుకధకులు. షేక్ సుభాన్ హస్యం. రజనీగంగాధరం గారు దానవీరశూరకర్ణ, విరాటపర్వం, సీతాకళ్యాణం వగైరా బుర్రకధలు రచించడమేగాక అనేక దళాలకు తర్ఫీదుయిస్తున్నారు.  నాటకాలు, నాటికలు, ఏకపాత్రలు ఎన్నో వ్రాశారు.  కొంతకాలం"సమాచారప్రభా వారపత్రిక ఎడిటర్ గా నడిపారు.

12. ప్రసాద్ పార్టీ:-

    పెద్దాపురం.  ఈ బృందంలోకధకురాలు మహిళ. వంతలు పురుషులు నాజర్ బాణీలే- సీతారామరాజు వగైరా కధలు దేశంలో అనేకచోట్ల చెప్పారు.