పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/317

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తుండడంకూడా జరుగుతుండేది. వీరు భారతదేశంలో అనేక రాష్ట్రాలలో కధలుచెప్పి సెహబాష్ అనిపించుకున్నారు. పల్నాటియుద్ధం మీ పేటెంటు కధ.

7. దిండి బ్రదర్స్:-

    ఢవళేశ్వరం.  వీరుముగ్గురూ ఏకోదరులే.  వీరిదికూడా నాజర్ బాడీయే.  ఈమధ్యకాలంలో వ్యాఖ్యానానికి ఒకమహిళకు తర్పీధుయిచ్చిఆమెతో కధలు చెబుతున్నారు.   కధకులు శ్రీ దిండి సత్యనారాయణ.  హాస్యం శ్రీ దిండి లక్ష్మినరాయణ.  వీరికధలో హాస్యగాని ప్రాముఖ్యం ఎక్కువ.  సినీమా పాటలతో తన ప్రేమపురాణాన్ని చెప్పేహాస్యకధ బాగా అలరిస్తుంది.  పల్నాటియుద్ధం, బొబ్బిలియుద్ధం, వీరాభిమన్యు వీరువిరివుగా  చెప్పే కధలు.  ఈ గ్రంధకర్త కధకుడుగా పైసోదరులిరువురూవంతలుగా పార్వతీ కళ్యాణంబుర్రకధ రాజమండ్రి త్యాగరాజనారాయణదాస సేవాసమితివారి ఉత్సవాలలోనూ, శ్రీ వెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలోనూ సత్యసాయి నవభారత గురుకులంలోనూ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ చెప్పే పలుప్రశంశలుపొందడం జరిగింది.

8. మర్ల భద్రేకాళి దళం:-

 తాపేశ్వరం. (తూ.గో). ప్రస్తుతం జరంజకంగా పాడడంఒలోనూ, కధచెప్పడంలోనూ ఈమెకున్న ప్రసిద్ధిహెచ్చు.  రేడియోలో యీమెకధంటే జనం చెవికోసుకుంటారు.  బాణీలూన్నీ నాజర్ బాణెలే.  పల్నాటియుద్ధంలాంటి కధలేగాకుండా ప్రభుత్వప్రచారకధలు, కుటుంబనియంట్రణ వగైరాలపైచెప్పే కధలు కూడా ఎంతో ఉత్తేజకరంగా చెప్పడం యీ దళం విశేషం.

9. మణి సిస్టర్స్ దళం:-

   ముమ్మిడివరం (కోనసీమ).  వీరుముగ్గురూ స్త్రీలే. నిట్లాబ్రదర్స్ వారి కధకు మక్కికిమక్కి అనుకరణ.  కధ రక్తిత్గాచెప్పడం, శ్రావ్యంగా పాడడం, చక్కని నృత్యాభినయాలు వీరి విశిష్టత.  వీరి వీరాభిమన్య పలువురి మన్నలందిన రసగుళిక.