పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/319

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14. పాక్ నాస్టారు బృందం:-

     రాజమండ్రి.  వీరుకూడా నాజర్ మూసలోనే చెబుతారు.  బొబ్బిలి యుద్ధం వీరు విరివిగా చెప్పేకధ.

15. కృష్ణాబృందం:-

          రామచంద్రపురం.  వీరిదీ నాజర్ అనుకరణే.  ఇందు వ్యాఖ్యాత కధ వాక్ప్రవాహంత్6ఓ ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్నిచేస్తారు. నాజర్ కధలే కాకుండా "ఊరుమారింది" వంటి క్రొత్తకధలనుకూడా చెప్పి జనంలో జాగృతి కలిగించడానికి కృషి చేస్తున్న యువకధకుల దళం.  కధకులు గొఱ్ఱెల కృష్ణ, వ్యాఖ్యానం గొఱ్ఱెల రామం.  హాస్యం చెక్కా. టె,వి. ఆర్టిష్టులు, ప్రజానాట్యమండలి పోటీలలో గొఱ్ఱేలరాము ఉత్తమవ్యాఖ్యాత ప్రయిజుపొందారు.  ఈ దళం ద్వితీయ ఉత్తమప్రధర్శన బహుమతి పొందింది.  మద్రాసు, బెంగుళూరు, కలకత్తా, బొంబాయి మొదలగు చోత్లప్రదర్శనలిచ్చి దేశవ్యాప్తంగా పేరుపొందారు.  గొఱ్ఱెల కృష్ణకు 'యక్షగానకెసరి ' గొఱ్ఱెల రామంకు "కధావచనసుధానిధి" అని బిరుదు లిచ్చి ప్రజలు పలుచోట్ల సన్మానించారు.

16. రమణ పార్టీ:-

    రాజమండ్రి.  వీరు ప్రసిద్ధిగాచెప్పే కధ కర్ణ, రాజమండ్రి  పోటీలలో కూడా పాల్గొన్న దళం.

17. సబ్బికనకారావు దళం:-

     లక్కవరం.  (ప.గో) కధకులు సబ్బికనకారావు హాస్యం రౌతు వెంకటేశ్వరరావు.  వ్యాఖ్యాత రామారావు.  వీరు బొబ్బిలియుద్ధం, సీతారామరాజు, కూలిదండి కధలు అద్భుతంగా చెబుతారు.  వీరు రాజమండ్రి పరిషత్ లో "శ్రమజీవులు" కధచెప్పి మొదటిబహుమతి పొందారు.  కధాసంవిధానం, నడకలు, బాణీలు, వేషం, అభీనయం, కధకునిలో నిండుగా ఉన్న దళం యిది.  కధకుడే యీ దళానికి కధానాయకుడు.  చక్కని గొంతు, రసోత్పత్తితో ప్రేక్షకుల్నిఉరూతలూగించే కధకుడు.

18. పెంటయ్య దళం:-

         లింగంబోయినచల్ల.  (ప.గో.) కాలిశెట్టి పెంటయ్యగారు కధకులు, వీరు రచయితకూడా,ఆంధ్రదేశంలోనేగాక యితర రాష్ట్రాలలోకూడా కధలు