పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/313

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3) రగడలు, నడకలు, మాటలు, పాటలు ఒకటే మూస్స వెరైటీ లేదు. నవ్యతలేదు.

     4) హాస్యకధలుకూడా అనాదినుంచీ చెబుతున్నవే.  నవ్వురావడం లేదు.  పైగా క్రొత్తగాచేసే ప్రయత్నం - అక్షరాలు అర్ధంకాకుండా మాట్లాడే ఓ సినిమా హాస్య నటుణ్ణి అనుకరిస్తూ మాటలుతెలియకుండా కంగారు కంగారుగా పలకడం అసలుకే ఎసరు పెడురోంది.
   ఇతరలోపాలు:- "బొబ్బిలియుద్ధం"లో బొబ్బిలిరాజులు వన్యమృగవేటలో ఉత్సాహంతో పందిని కొట్టినప్పుడు ఉత్సాహవంతంగా కధకుడుపాడే రగడకు వంత 'నారాయణా" అనడం అర్ధవంతంకాదు.  కధ ఉత్సాహపూరితం, వంత విషాదభరితం కావటం అంగిరసానికి అభాసం కలిగిస్తుంది.  అల్లంటిదే మరొక వంత "రామదాసు శ్రీరామారామ రామా రఘురామా" అనేదికూడా.  ఉత్సాహంలో యిదికూడ వాడడం సరికారు.  అలాగే వీరుడిఅన కధానాయకుడు చచ్చిపోయినప్పుడు "భళీ భళీ" అనే వంతకూడా సముచితంకాదు.  ట్యూన్ శోకరసానికి సంబంధించినదైనా శబ్ధార్ధం దానికివ్యతిరేకం.
   అలాగే నృత్యం ఎక్కువకావడం కధను దెబ్బతీస్తోంది.  వాచకం స్పీడ్ కావడంతో విషయం తెలియకుండాపోతుంది.  తంబుర, అందెలు ఢక్కీలు అలంకారప్ర్రయంగాధరించడం అధర్మం. అవి వాడాలి. తంబుర మీటుతూ, తాళానుగుణంగా అందెకొడుతూ, ఢక్కీలు రసానుగుణంగా వరుసలుమారుస్తూ వాయిస్తే ఆనాదాలలోకలిసినపాట కర్ణరసాయనంగా ఉంటుంది.
    ఆహార్యందగ్గరికొస్తే వ్యాఖ్యాత పాగాలేకుండా జానపదరాకుమారుడవడం టీము "సిమెట్రీ"ని పాడుచెస్తోంది.  అసలు దళమందరూ (మగాళ్లయితే) పాగాలుచుట్టి, నడుముచుట్టూ గుడ్డకట్టిచెప్పడమే సంప్రదాయం.  కధకుడితలకు తురాయిపెట్టుకోవడం నాటకంలో ఏదో రాజు వేషంగా కనిపింపజేస్తుంది అసహజంగా.
     నృత్యం అస్తమానూ ఒకేలా చెయ్యడం, నడకిఅలలోవైవిధ్యం లేకపోవడం, కదలికలు అతికావడం, చూసిన భంగిమనే మరల మరల