పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/312

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని ప్రారంభించబడ్డ యీకధలోని కానుపెనుగు, రగదపట్టు, సాహిత్యసుచారం తరువాత సామజికస్పృహకల్గినరచనలను మార్గదర్శకమయింది. వినరా భారత వీరకుమారా విజయంమనదేరా" అనే క్రొత్తవంత అప్పుడేపుట్టింది.

 సుంకర, వాసిరెడ్ది "కష్టజీవి", "సీతారామరాజు" వంటి విప్లవ కధలువ్రాసి జనంమీదికి విసిరితే పతివాదలాంటివారు "పట్టాభి", "నేతాజీ" మొదలగు రాజకీయ నాయకుల చరిత్రలు వరిలాదు.
  ఇక ప్రేదర్శనల్లోకివస్తే "నాజర్ " అడుగుజాడల్లో జూనియర్ నాజర్, నిట్టాలాబ్రదర్స్, దిందిబ్రదర్స్, బెనర్జీదళం. యింకా ఎన్నో బృందాలు వట్టిధక్కీలూ తంబురా అందెలతో కధలుచెబుతుంటే, యివి నామమాత్రంగాధరించి హార్మోనియం, తబలా యింకా రకరకాల మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంట్సుతో నిడదవోలు అచ్యుతరామయ్య, కృష్ణమాధవరావు మొదలగువారు హరికధమట్టులూ, నాటకప్రద్యాలూ జోడించి హరికధలాంటి బుర్రకధలు చెప్పేవారు.  బుఇర్రకధల్కు యిదోరకం ఆధినీకీకరణ అన్నట్టు.
   ఒకదశాబ్దంక్రితంవరకూ దేశమంతా ముమ్మరంగా జరిగిన బుర్రకధాప్రదర్శనలు ఆశ్చర్యంగా ఇప్పుడు ప్రజలముందు విఫలంకాఫడం ప్రారంభించాయి.  కధలకు జనం రావడంలేదు.  వచ్చినకొంతమందీ కొంతసేపటికే వెళ్ళిపోతున్నారు.  ఆఖరికి ఏ యిద్దరైనా మిగిలితే వీళ్ళలో ఒకదు మైక్ మనిషి, రెండోవాడు బల్లలు మోసుకెళ్ళేమనిషి. కధ అయ్యేవరకూ వాళ్ళు చచ్చినట్టు కూర్చొవలసిందేగా మరీ! ఈ దుర్దశకు కారణం ఏమిటాఅని ఆలోచిస్తే మనకు గోచరించే ప్రధానకారనాలు నాలుగు.

1) పాతకధలుతప్ప క్రొత్తకధలు రావడంలేదు. రచయితలెవరూ బుర్రకధలు వ్రాయడంలేదు.

2) కధల్లోకూడా ఎప్పుడో నాజర్ ఏర్పటుచేసుకునిచెప్పినవిధానమే తప్ప మార్పులేదు. ఎవరుచెప్పినా అవేకధలూ, అలాగేచెప్పడంతో జనానికి బోరుకొట్టేసింది.