పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

275

చూపుకు విసుగును కల్గిస్తున్నాయి. విలన్ చచ్చిపోతే విషాదమెందుకు? సాఫీగా చెప్పవచ్చుగా! సినిమావరుపలు సౌకర్యంకాదు. సంప్రదాయమూ కాదు. పైగా ఆబాణీలు ఎక్కువకాలం నిలిచేవికావు. జానపదబాణీలు శాశ్వతమైనవి. పల్లెజనాన్ని పులకరింపజేసేవీను. వెన్నెల పాటలు, తుమ్మెదపదాలు వగైరా చొప్పిస్తే కధకు జాతీయతవస్తుంది. వీరరస పోషణలోనూ, కరుణరసపోషణలోనూ మనుషుల్ని కదిలింపచేస్తున్న యీ కళాకారులు యీ స్వల్పలోపాలనుకూడా సరిదిద్దుకుని ఈక్రిందిఅంశాలపై దృష్టి పెట్టి సాధనచేస్తే బుర్రకధాకళారంగానికి కొత్తఊపిరి రాగలదు.

అవి 1) కధాకధనం 2) వాచకం 3) ఆహార్యం 4) అంగికం 5) సాత్వికం 6) రసపోషణ 7) సంగీతం 8) నృత్యం 9) అభినయం 10) పనిముట్లువినియోగం 11) రగడపట్టు 12) కాలనియమపాలన 13) టీమ్ వర్కు 14) నాట్యం 15) జనరంజకత్వం.

రచయితలు ముడిచిన తమకలాలలోనిసిరా మళ్ళీ బుర్రకధలమీద చిందిస్తే యీరంగం పునరుజ్జీవనంతో తప్పక విజృంభిస్తుందనేది నిస్సందేహం.

గోదావరిసీమలో బుర్రకధ దళాలు

ఈసీమలో బుర్రకధ ప్రదర్శనజరగని గ్రామంలేదంటే అతిశయోక్తి కాదు. ఉత్సవాలకారణంగానో, ఎన్నికలకారణంగానో, వివాహాల సందర్భాలలోనో గత 50ఏళ్ళలో యివి చాలాముమ్మరంగాసాగేవి. బుర్రకధ దళాలుకూడా దేశంలో ఈ సీమలోనే ఎక్కువగా ఉద్భవించాయి. వీనిలో నాజర్ బాణీలో నృత్యం, అభినయం, వేషం, 2 ఢక్కీలు, తంబుర, అందెలతో కధచెప్పేదళాలుకొన్ని, నామమాత్రంగా తంబుర, ఢక్కీలు హర్మోనియం, వైలిన్, తబలాలతో (నృత్యాభినయాలు లేశమాత్రంగా) హరికధబాణీలో కధచెప్పేదళాలుకొన్ని, పౌరాణికనాటకంలా రంగస్థల పద్యాలతో కధచెప్పే దళాలుకొన్ని.

1. భానుమూర్తి బుర్రకధదళం:-

మండపేట, నాజర్ బాణీలోకధ. సుంకర, వాసిరెడ్డి కష్టజీవి కధ వీరుచెబుతుంటే ప్రేక్షకులరక్తం వేడెక్కిపోయేది. తూర్పుగోదావరిజిల్లాలో