పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/280

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సన్మానాలగురించి చెబుతూ కనకాబిషేకం, రత్నాభిషేకం,పుష్పాభిషేకంతోపాటు శిలాభిషేకం అని ఓ క్రొత్తది చెబుతారు. శిలాబిషెకమంటే ఆ మనిషి నెత్తిమీద రాళ్ళు రువ్వడమట.

                              మం దు ల వాళ్ళు
   మగవాళ్ళ్ని 'పుంజు ' అనీ, ఆదవాళ్ళని 'పెట్ట ' అని పిలుచుకుంటూ రకర్కాల ధిష్ఠిపూసలుధరించి, స్త్రీ పురుష వేషాల్తోవచ్చి "భద్రాచలం, సస్తరు ప్రాంతాలవాళ్ళం, చెవిలోపోటు, కంటిలో పోటు, చిరోవాతానికి శేతలపైత్యానికి, కొరింతదగ్గుకి మందులు యిస్తాం మందులు" అంటూ "ఒక్కరికి మందిస్తే యింటిల్లపాదీ తానం చెయ్యాల. మంచాలూ, కుంచాలూ, తదుపుకుని వంశీకులకు త్తరాలెసుకోవాల"అని మాటలు పట్టి

పట్టి కోయభాషలాగ అంటుంటే మొదట నిజంగా మందులవాళ్ళేవచ్చారనుకుని చేరిన జనం చివరిమాటకు పగటి వేషగాళ్ళని తెలిసిఘొల్లున నవ్వుకుంటారు.

     ఇందు ఆడువారు తమ జాతినిగురించి చెబుతూ తమలో ఏడు మనువులెల్లిన స్రీ పెద్దపేరంటాలుక్రింద లెక్క అనీ అందుకోసం తంబాలుపడుతూ యింతవరకూ తామెంతమంది మగలను మార్చిందీ మంచి హాస్యంగా చెబుతారు.
                     సా తా ని వై ష్ణ వు లు
    నుదుబా గుండెలమీదా భుజాలమీదా పెద్దపెద్ద నామాలుదిద్ది, అక్షయపాత్రలు ధరించి, హార్మోనియం మద్దెళ్ళతో త్యాగారాయ కీర్తనలు పాదుకుంటూ వ్చ్చి "మేమంటా వైష్ఠవులమండీ - అంటే శ్రీవైష్ణవులం మాత్రంకాదు.  103 దివ్యక్షేత్రాలు సేవించుకుని తిరుపతి వేలుతున్నాం. కంటెలుగానీ వెంది బంగారు రూపేణా మీవద్ద ముడుపులు వుంటే మా అక్షయపాత్రలో వెయ్యండి.  మీరిచ్చే ముడుపులన్నీ కైంకర్యం చేసేస్తాం.  మీరే వెళ్ళాలంటే రానూ పోనూ చాలా ఖర్చూ శ్రమా, మావంటి భక్తుల కిచ్చారంటే మరిఢోకాలెదు" అంటుంటే  చుట్టూచేరినజనం ఈ దొంగ భక్తులమాటలకు కిలాకిలానవ్వుకుంటుంటారు.