పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/279

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇలా అనెక గ్రంధాలలోని పద్యాలూ శ్లోకాలూ ఉదహరిస్తూ కులవ్యవస్థని తూర్పారబడుతుంటే అతని శాస్త్ర పరిజ్ఞానానికి ఆశ్చర్యం వేస్తుంది. చివరగా ఊళ్ళొకి దాన్య, పప్పులూ అమ్మకానికి వచ్చాయనీ ఉప్పు కుంచం వందరూపాయలనీ మినుములు కుంచం రెండొందలనీ పెసలు కుంచం నాలుగొందలనీ కావలసిన వాళ్ళంతా వొచ్చి కొనుక్కోండొహో" అని దండోరా వేస్తుంటే జనం నిర్ఘాంతపోయి చూస్తుంటారు.

         కా రు వా సా ని - సొ మ యా జు లు
   ఇవికూడా వినోద ప్రధానమైనఫి.  కారుసాని తురకవేశ్య.   సోమయాజులు చాంచసబ్రాహ్మణుడు.  ఆమె తురకంలో మాట్లాడేమాటల్నిసొమయాజులు తెలుగుమాటలుగాతీసుకొని సంబాషించే తీరు నవ్వు పుట్టిస్తుంది.
  ఆమె 'ముసల్మాన్ " అంటే 'ముసలమ్మవా" అంటాడు.  'కోంహై" అంటే మాది "కోనసీమ" కాదంటాడు.  "గానా సునే గాయా" అంటే "గానుగ సున్నం వద్దు" అంటాడు.
   ఇక శాస్త్ర ప్రకారం పాపపుణాల విషయం చెబుతూ -
  అవును దానంచేస్తే పుణ్యం, గర్బంతోవున్న ఆవుని దానం చేస్తే మరీ పుణ్యం, దూడతోనున్న ఆవును దానంచేస్తే మహాపుణ్యం.  ఈ ప్రకారంచూస్తే కన్యాదానం పుణ్యంగనుక గర్బినీస్రీనిదానంచెయ్యడం మరీపుణ్యం, పిల్లలతల్లిని దానంచెయ్యడం మహాపుణ్య్హం అవుతుందనీ సిద్ధాం తీకరించడం బలే నవ్వు తెప్పిస్తుంది.
  తనను గురించి చెబుతూ "మేము బ్ర్రహ్మలం - మా అన్నయ్య గరి పేరు నిరక్షరకుక్షి విరూపాక్షదీక్రితులుగారు - పొట్టి చింపినా అక్షరం ముక్కరాదు.  మాతమ్ముడు నిరంతర తస్కర సోమయాజులు -పోలీసు వారితే మంచి దొస్తీ.  నా నామాంకితం మండ్రగబ్బ దీర్ఘవృశ్చిక వృత్తి పొట్టసొమయాజులు-నాశిష్యులు గొంగూర పేరిశాస్త్రులు, వుల్లిపాయల లింగావధాన్లు, దొమ్మరి రాఘవాచార్యులు, దూదేకుల పెద్దింభొట్లు, సాతాని శంభులింగం" అని చెబుతుంటే ఆ మాటలకు పగలబడి నవ్వుతుంటారు జనం.