పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/278

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గట్టిన పంచెతో డప్పు వాయిస్తూ 'రాలె ...చెల్లీయలో - రామా రాఘవతెల్లీయలోయ్ - ఊరికి వెలుపల ఉన్నామండోయ్ - ఊరపందిని తిన్నామండోయ్, తాలే ...చెల్లీయలోయ్ ...శివతాలే ... చెల్లీయలోయ్" అని పాడుతూ దానికి అనుగుణంగా గంతులెస్తూ వస్తాడు. బేదాల్నీ గురించీ జాతులగురించీ కులాలగురించీ పాటల్లోనూ మాటల్లోనూ విమర్శనత్మకంగా చెబుతూ విన్న ప్రతివారినీ ఆలోచింపచేస్తారు. అంటరానితనాన్ని గురించి పాట--

"కుక్కను కొతిని కొల్చుతారయా
నందిని పందిని పూజ సేతురూ
తోటి మానవుడు ఎదురై వస్తే
దూరం దూరమని తొలగిపొదురు ||తాలే||
(కుక్కంటే కాలభైరవుడు, కోతంటే హనుమంతుడు, పంది అంటే వర్
హావతారమని గ్రహించాలి).
కులాలగురించి-
"శునక గర్భమున జన్మించిన ఆ శౌనకముని గోత్రమ్ము చెప్పరా
  మండూకమునకు పుట్టినట్తి ఆ మాండవ్యుని కులమేదో తెల్పుడి ||తాలే||
 రకరకాలుగా కులాలు లెవూ - రంగురంగులా మతాలు లేవూ
 కలిగినవాడిడి గొప్ప కులమురా లేనివాడిది లేకికులమురా ||తాలే||
వశిష్టుని గురించి -
"తల్లి తొలుతలంజ తనయాలి మాదిగ
  తాను బ్రాహ్మడనగ తగునె జగతి
  తపస్సువల్ల ద్విజుడు తర్కింపకులమేది
 విశ్వదాభిరామ వినురవేమ"
శూద్రులగురించి, బ్రాహ్మణుల గురించి -
"జన్మానా జాయితే శూద్ర:
 కరాణా జాయతే ద్విజ:
 వేదభ్యాస్ విప్రశ్యాత్
 బ్రహ్మజ్ఞావంతు బ్రాహ్మణ:"