పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/277

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొట్టుకుని యిలావిప్పి చెబుతాడు. పాకమీద ఆనబకాయ కత్తితో 'కరకర ' కొస్తే ఐద్ 'జర జర ' జారి క్రిందనున్న మేక నడుంమీద 'దిబుక్కున ' పడితే, మేక, 'మే ' అంది అంటారు. మొత్తంమీద యిదికూడా వినోదానికి సంబంధించిన వేషం.

                                         పి ట్ట ల దొ ర
    కాకీనిక్కరూ, చొక్కా టక్ చేసి, దొరటోపీ పెట్టుకొని, చేతిలో తుపాకీ తొ వచ్చి జాతీయ అంతర్జాతీయ విషయాలూ, ప్రభుత్వ విధానాలూ పెద్ద అధికారిలా వివరిస్తారు.  వ్యంగ్యం ఈ పాత్రేకి ప్రాణం.  జనాభా సమస్య గురించి చెబుతూ "దేశంలో జనాభాపెరిగిపోయి ఆహారకొరత రాబోతోదనిగ్రహించినప్రభుత్వం 60 ఏళ్ళు దాటిన ముసలివాళ్ళందర్నీ అర్జంటుగా కాల్చిపారెయ్యమని తనకి తాఖీదు పంపిందనీ, అందుకే తాను వచ్చాననీ, మీ యింట్లొ ముసలివాళ్ళెవరెవరున్నారు?" అని అడుగుతుంటే అది వింటున్న కుర్రాడొకడు ఘోల్లుమని ఏడవడం ప్రారంభించాడట.  అంత సహజంగా చేస్తారు ఈ వేషాల్ని.
                                ఫ కీ ర్లు
    ఈవేషాల్లో అయిదారుగురు వస్తారు.  ఉరుదూయాసతో తెలుగు మాట్లాడతారు.  జీవాత్మ ప్రమాత్మలగురించి చెబుతూ "తన్వుకీ ప్రాణాన్కీ ఉన్న స్నేహం గొప్పది.  ఒకదాన్కీ బాధావస్తే మరొకదాన్కీ బాధా కల్గుతుంది.  ఇదీ దోస్తి     "...ఇలా దేహాన్ని గురించి చెబుతూ" ఒక అడివికిపోయి చిల్కా తెస్తాం - పంజరంలోపెట్టీ పళ్ళూ పప్పులూ పెడ్తాం విద్దెల్ సెపుతాం. అది మనల్ని నమ్మిందికగా అని దాన్నీ నమ్మీ సంతొషా పడ్తాం.  కానీ పంజరం తెరచీవున్న వేళా అది ఎఫరికీ చెప్పాకుండా జంగిల్ కా ఎగిరీపోద్ది.  ఈ దేహమనే పంజరంనుంచీ జీవామనే చిల్కా అట్లాగే ఎదిరీపోద్దీ". ఇలాగ లోకంలోని సామాన్య ఉపమానాలతో ఎన్నో విషయాలు చక్కగా చెపుతారు.
                                  మా ది గ వే షం
   తలకు పెద్దపాగా, నల్లనిముఖంమీద ఎర్రని కుంకంబొట్టు, మెడలో తాయెత్తు, చెవిమీద సగంకాల్చినచుట్ట, చిప్పలమొలత్రాడు, పైకి ఎగ