పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/253

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'శుక్లాంబరధరం విష్ణుం శసివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్పర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనెకదంతం భక్తానాం ఏకదంతముపాస్యహే ' అనే శ్లొకం
                                          తోనూ--

"తుండము నేక దంతమును తోరపు బొజ్జయు
వామహస్తమున్ మెండుగ మ్రోయుగజ్జెలును
మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల
నొజ్జయైయుండెడి ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్"

   అనే అద్యంతోనూ గణపతి ప్రార్షనచేసి తరువాత "సరస్వతీ సమస్తుభ్యం, వరదేకామరూపిణీ, విద్యారంభం, క్రిష్యామి, సిద్దిర్భవతుమే సదా"
అనే ప్రార్ధనతో సరస్వతీబొమ్మనూ ప్రదర్శిస్తారు.

   ఒకసారి ఒకతోలుబొమ్మలాటమేళం ఒకఊరునుంచి అడవిదారిన మరొక ఊరు వెళుతున్నారట. అడవిలో చీకటిపడితే కొందరువచ్చి ఆరాత్రి అక్కడ బొమ్మలాట వెయ్యమని, తెల్లవారి పారితోషికంయిస్తామని చెప్పారట అర్ధరాత్రి ఆట ప్రారంభమయింది. జనం కుప్పలు తిప్పలుగా వచ్చారు. కొంతఆట అయ్యేసరికి ఆంజనేయపత్రప్రవేశించి దరుల్తొ మంచి రమ్జుగా వేషం సాగుతోందట. మధ్యలొ ఆటగాళ్లుప్రేక్షకరసస్పందన చూద్దామని తెర తొలగించి చూసేసరికి ప్రేక్షకులు ఒక్కరూ లేరట. ఏవిటాఅని ఆశ్చర్యపోయి అప్పటివరకూ ఉన్న ఆప్రేక్షకులు దెయ్యాలూ బూతాలూ అని అర్ధమై భయంతో యిక వదలకుండా తెల్లవార్లూ ఆంజనేయపాత్రనే ఆడించారట. ఆంజనేయస్వామిపేరు తలిస్తే దెయ్యాలూ భూతాలూ పారిపోతయట. ఇది ఒక కధే అనుకోండి-