పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/254

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాని వర్షాలు కురవకుంటే వీరిచేత బారంలోని విరాటపర్వంఆడిస్తే వర్షాలుకురుస్తాయని యిప్పటికీ పల్లెజనాలకు పెద్ద విశ్వాసం

   తొలుబొమ్మలాట యక్షగాన పద్దతిల్జో ఉంటుంది. ఇందులో ద్విపదలు, వచనాలు, పద్యాలు, దరువులు ఉంటాయి మేకతోలుతో బొమ్మలు తయారుచేసి రంగులద్ది వారికి కావలసినరూపులో అద్బుతంగా వారే తీర్చిదిద్దుతారు.

తోలుబొమ్మలాటవారి ప్రతిభను గూర్చి భాస్కర శతకంలో యిలావుంది.

"ఇంచుక నేర్పు చాలక విహీనత జెందిన నకవిత్వమున్
  మించు వహించి నేకతన మిక్కిలి యెట్లన తోలు బొమ్మలన్
  మంచి వివేకి వాని తెరమాటున నుండి ప్రశప్తరీతినా
  డించిన వాడనే జనులడెందము నింపవె ప్రీతి భాస్కరా"

కబ్బయా మాత్యుడు తన అనిరుద్ద చరిత్ర పీఠిక 12 వ పద్యమ్లో-
      -- -- --- తెరలో కధ చొప్ప్పున బొమ్మలాడగా, నొకకడ
హాస్యపుం బ్రతిమలుండవెపెక్కులు వెక్కిరించుచున్" అని వ్రాసాడు.
ఇది కధకు సంబంధంణలెని విషయాలు కూడా మాట్లాడుతూ హాస్యాన్ని అందించే గాండోలిగాడు, బంగారక్క, కేతిగాడు పాత్రలనుద్దేశించి
చెప్పినది.

              పండితారాధ్యచరిత్రలో పాల్కురికి సోమన -
            *భారతాఇ కధల చీరమరుగుల నారంగబొమ్మ్ల నాడిం
చువారు" అని బొమ్మలాటల పేర్కొన్నాడు. అంటే 12 వ శతాబ్ది నాటికే
యివి ప్రసిద్ధిలో ఉన్నాయన్నమాట.

         గోదావరిసీమలో యీ తోలుబొమ్మలాటవారు కాకినాడ దగ్గర మాధవపట్నంలోనూ, ద్వారపూడిదగ్గర జడ్.మేడపాడులోనూ, ఏలూరు దగ్గర శనివారప్పేటలోనూ, రాజమండ్రిదగ్గర ధవళేశరంలోనూ అనాదినుండీ ఉంటున్నారు. "ఒక్క మాధవపట్నం గ్రామం నివాసస్థలంగా చేసుకునిరమారమి అయిదువందల కుటుంబాలు నివసిస్తున్నాయీ వీరిలో


  • ఎస్. గీత. "అభినయ" 28, 29 డిశంబరు 1980 సంచిక 'తోలుబొమ్మలాట ' వ్యాసంనుండి.