పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/252

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాయకులను పంపి గురవయ్య తలతీయించ సిద్ధవటం సీమసేనాని అతనిఘోరాలనుండి తప్పించేడట.

 ఆలోచించి చూస్తే ఇది షెక్సిపియర్ 'హేమ్లెట్ ' నాటకంలోని అంతర్బాగాన్నితల;ఉకు తెస్తుంది.
                      తోలు బొమ్మలాట
    ఊరిమధ్య కాళీజాగాలో పందిరివేసి, మూడుప్రక్కలామూసివేసి, నాలుగువవైపు తెల్లనితెరగట్టి, లోపల ఆముదందీపాలవెలుగులో ఆతెర మీద తోలుబొమ్మలు నిలిపి వానిని కదుపుతూ రామాయణ, భారత, భాగవత ఘట్టాలను కెర్తనలుగానూ, పద్యాలుగానూ, వచనంగానూ ఆయా పాత్రల సంబాషణలుగా వెనుకనుంచి పలుకుతొ మంచి రసవత్తరంగా రత్రంతాసాగించే ప్రదర్శన తోలుబొమ్మలాట మధ్య మధ్యలో బంగారక్క, గాండోలిగాడు, కేతిగాడు, జుట్టు పోలిగాడు హాస్యోకులతో ప్రేక్షకుల్ని అలరిస్తూ విదుర మేల్కొలుపుతుంటారు.  వీరి సుదీర్ఘమైన తారస్థాయిరాగాలాపనపద్ధతికి తోలుబొమ్మలాట రాగాలని ప్రతీతి. ఇందులో ఆనందభైరవితీగడ బలే గమ్మత్తుగా ఉంటుంది.  మురారి రాగం వీరి ముద్దుబిడ్డ  ఈరాగాలు తీసేటప్పుడు ఒకరుతీస్తున్నరాగం మధ్యలో మరొకరందుకోవడం, సాగదీసి సాగదీసి అన్నిస్థాయిలూ పలకడం అదోపద్దతిగాఉంటుంది.
        * 'సంస్కృతంలో ఛాయానాటకములనేవి ఆంధ్రదేశంలో తోలుబొమ్మలాటలుగా వ్యవహరింద బడుతున్నవి.  బొమ్మలుచేసే పదార్ధాల్ని బట్తి వీనికాపేరు వచ్చింది '
      ** వినోదంతోపాటు విజ్ఞానాన్ని, రేడియొలూవార్తాపత్రికలూ లేని రోజుల్లో వార్తాప్రసారాన్ని ప్రజలకు అందించిన యీ బొమ్మలాట మానవుని ఆదివినోదము"
           తోలుబొమ్మలాట ప్రదర్శనలో మొదటగా తెరమీదగనపతిబొమ్మను ప్రవేశపెట్టి-

  • కూర్మావేణుగొపాలస్వామి. నాట్యకళ ఫిబ్రవరి-మార్చి 1970 పు.114
    • యం. వి. రమణమూర్తి డితో పు.119