పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/251

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భాగవతులు భామాకలాపం, గొల్ల కలాపం లాంటివి ప్రదర్శిస్తుంటారు. ఇందు మాటలు తూర్పు యాసతోనూ, రాగాలు తోలుబొమ్మలాట ఫణితిలోనూ ఉంటాయి. 'చిటపటచినుకులు దుప్పటి తదిసెను ' వీరిదే. ఇది యక్షగాన ప్రక్రియ, తెరలా చిన్న గుడ్డకట్టి, దానివెనుకనుండి భామ రాగానే ఆతెర తొలగిస్తారు. నృత్యం శాస్త్రీయం కాకపోయినా సశాస్త్రీయమన్నంత భ్రాంతి కలుగుతుంది. ప్రతి దరువుకీ వంతగా ఒక బ్రాహ్మణ వేషధారీ ఒకరిద్దరు తాళంకొట్టేవాళ్ళూ మద్దెలవాయిద్యగాండ్రూ సహకరిస్తూ నాటకంవలె మంచి రక్తిగా నడిపిస్తారు. యానాది భాగవతుల 'చెంచులక్ష్మి ' నాటకం ప్రసిద్ధమైనది. "చెట్టులెక్కగలవా నరహరి పుట్టలెక్కగలవా ' వంటి పాటలు పల్లెప్రజల నోటపట్టడానికి వీరి వీధి నాటకమే కారణం. మాదిగభాగవత్లు కొంచెం రంగాన్ని ముందుకు నడిపారు. పందిరిక్రింద బల్లలువేసి ముందు తెర, వెనుక తెర కట్టి నాటకం ఆడేవారు. వీరి నాటకాలలో ప్రసిద్ధి చెందినది 'శశిరేఖా పరిణయం '. పాటలా మాటలతొపాటు నేటి పద్యపఠన విధానం కూడా చోటు చేసుకుంది ఇందులో. నేటి నాటక రంగానికి దగ్గరగా ఉంటుంది వీరి ప్రదర్శన.

    శ్రీనాధుని చాటువులలో 'బాగొతుల బుచ్చిగాడు ' అనే మాట వీరి ప్రాచీనతను తెలుపుతుంది.  ఈ భాగవతులుకూడ 'తాండవ నృత్యహరీ గజానన ' అంటూ గనపతి ప్రార్ధనతో అర్ధరాత్రి ప్రారంభించి తెల్లవారే వరకూ ఆడేవారు.
     ఈ భాగవతులు ప్రదర్శన ప్రయోగ ప్రయోజనాన్ని గూర్చి ఒక చారిత్రాత్మక గాధ కూడా ఉంది.  క్రీ.శ. 1505 - 109 కాలములో విజయనగరపాలకుడు కృష్ణదేవరాయల సవతి అన్న అయిన వీర నరసింహరాయల ఆస్థానంలో ఒకనాడు కూచిపూడి భాగవతుల ప్రదర్శన ఏర్పాటయిందట.  విజయనగర రాజుల ఏలుబడిల్జోనున్న 'సిద్ధవటంసీమ ' 'సమ్మెట గురవరాజు ' అధీనంలొ ఉండెది.  ఆయన పన్నులు వసూలు చేయడంలో ఘోరాతిఘోరకార్యాలు చేసేవాడట.  పన్ను లివ్వనివారి భార్యలను ఈడ్చితెచ్చి వారి స్తనాగ్రాలకు చిరుతలు పట్టించి దారుణంగా హింసించేవాడట.  ఈ బాగవతులు వాని హింసాకాండను, అతని దుష్టచేష్టలనుకన్నులకు కట్టినట్టు ప్రదర్శించారట - దానితో రాజు ఉగ్రుడై దండ