పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/248

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కూడా ప్రచారంలో ఉండేవి. భజనలో ఒకరు పాటభాన్ని అభినయిస్తూ నృత్యంకూడా చేసేవారు. ఈ రచయిత బాల్యంలో మొదట నృత్యానికి గజ్జెకట్టింది యీ భనలోనే. రామభజనలాగే "జైహరనాద్ జై, కుసుమకుమారిజై" అనే నామంతో ఏకాహాలూ, సప్తాహాలు కూడా జరుగుతుంటాయి. పూర్వం యీ భజనలు వెదురుపాక, కొంకుదురు, రాయవరం. నె.సావరం, మండపేట, మహేంద్రవాడ, అర్తమూరు, బలభద్రపురం, రామచంద్రపురం, కొత్తూరు, సామర్లకోట,పెద్దాపురం, కాకినాడ, రాజమండ్రి, ధవళేశ్వరం, కొవ్వూరు, బీమఫ్గరం, ఆకివీడు, ఏలేశ్వరం లలో ముమ్మరంగా జరిగేవి. ఈ రచయిత తల్లిదండ్రులు, హరనాధభక్తులు కావడంవల్ల కొంకుదురులో యీ రచయిత యిల్లుకూడా హరనాధబజనలకు అలవాలంగా ఉండేది.

                   పండరిభజన
      "జెండా చెడా చెడాతే జాయేంగే పండారి జాయేంగే" అనిపాడుతూ వలయాకారంలోనిలబడి, కాషాయరంగుబట్టలు ధరించి, చేతిలో కాషాయ రంగుజేండాతొ దాదాపు 30 మంది నృత్యంచేస్తూ పాడుతుంటే, ఆవలయం మధ్యతిరుగుతూ గురువు పాటచెబుతూనృత్యగతి నడుపుతుంటే హార్మోనీ, మద్దెలను అనుసరిస్తుంటే చూసే జనం విస్తుపోయేలా సాగుతుంది పండరిభజన.  "ఇక ఎంతాదూరామో ఎరుగామే పండారి" అనే పాటకు వీరు చేసే భావ నృత్య విన్యాసాలు చక్కని రసస్పూర్తిని కల్గిస్తూ చూపరులను పులకింపజేస్తాయి  ఇది ఈ భజన రీతి దీనిని తూర్పుగొదావరిజిల్లాలో గొల్లలమామిడాడ వాస్తవ్యులు శ్రీ పడాల సత్యనారాయణరెడ్ది గురువుగా ఆ పరిసరగ్రామాలలో ఎన్నో జట్టులు తయారుచేశారు.  ఆవూళ్ళోనే శ్రీ బైరాగిరెడ్డికూడా పండరిభజనల గురువే.  50 ఏళ్ళ క్రితం పందలపాక వాస్తవ్యులు శ్రీ కొవ్వూరి ఆదినారాయణ రెడ్డి పండరిభజన గురుగా చుట్టుప్రక్కల ఎన్నో గ్రామాలలో దళాలు తయారుచేశారు.
  ఈ రచయిత గొంతు మాధుర్యానికి మురిసి పసితనంలోనే వీరు పండరిభజనలో తర్పీధుయిచ్చి భజనలకు తీసుకుపోయేవారు.  ఈ రచయిత కాలు నాట్యాలలొ పదునుతేరిన చోటిదే..