పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/247

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సీతారాం జయ సీతారాము; పట్టాభిరాం, పట్టాభిరాం, పట్టాభిరాం, జయ సీతారామ్" అని రామునిగూర్చి తెలిసినవన్నె విశేషణాలతో చేంతాడులాగ పాట పొడిగించుకుంటూ ఏకతాళంలో త్రికాలాల్లోనూ భజన భక్తిగా చేస్తార్. ఈ పాటలలో ప్రేక్షకులుకూడా కలిసి భజన చేస్తారు. "పాహిముకుందేశి" వంటి సంస్కృత పద భూయిష్టమైనపాటలు చక్కగా పా'డుతుంటే అర్ధంతెలియక పోయినా భక్తిలోలతలోమునిగి భజిస్తారు. మరొకవిశేసషమేమంటే 'రామ రామ రామ సీత ' అనె ఒక వాక్యంతో ఏకాహాలూ, సప్తాహాలు కూడా చేస్తారు. ఏకాహంఅంటే తొలిరోజు ప్రాత:కాలంలో ప్ర్రారంభించి మలిరోజు ప్రాత:కాలం వరకూ అనగా 24 గంటలు (ఒకరోజు) ఒకే నామంతో భజన చెయ్యడం. సప్తాహం అంటే యిలాగ 7 రోజులు చెయ్యడం ఈ భజనట్టులు ఊరూరా ఉంటాయి. కొందరు భక్తులు తమ యిళ్ళల్లోనే యివి ఏర్పాటు చేస్తారు. 'మేటియైనను భక్తకూటములందు పాటలుగా గట్టిపాడెడివారు '. అని పాల్కురికిసొమన పండితారధ్యచరత్రలో వాశారు. ఈ కళారూపం యొక్క ప్రాచీనత దీనినిబట్టి ఊహించుకోవచ్చు.

    గోదావరిసీమలో రామబజనలాగే 'హరనాధబాబా ' భజనలు కూడా చేస్తుంటారు చాలచోట్ల.  హ్రనాధబాబా భజనలో విశేషం భక్తులకు ఆవేశం రావడం, బాబాపూనడం  లాంటివికూడా ఉండేవి.  ఒకప్పుడు తూర్పుగోదావరిలోని వెదురుపాక గ్రామం లోబాబామేష్టారింట్లో నిత్యం యీ భజనలు జరుగుతుండేవి.  బాబా మేష్ఠారిభార్య హరనాధబాబా ఆవేశం పొంది జీవితాంతం ఆ ఆవేశంలోనే ఉండిపోతే భక్తులందరూ ఆమెనే బాబాగా ఆరాధించేవారు.అంతేకాకుండా బాబామేష్టారితమ్ముని భార్యపై కుసుమకుమారి (హరనాధబాబా భార్య) అవేశించిందని ఆమెను కుసుమకుమారిగా పూజించేవారు.  హరనాధబాబా స్మరనలో తన్మయుడై భజించేవారు బాబామేష్టారు.  అందుచేత ఆయన అసలుపేరు శ్రీ మల్యాల సత్యనారాయణ అనేది విడిచి అందరూ బాబామేష్టారని పిలిచేవారు.  ఆయన రాయవరం హైస్కూలులో ఉపాద్యాయులు.  20 వ శతాబ్ది పూర్వార్దంలో హరనాధభక్తులతొ ప్రసిద్ధులైన పాగల్ దాసుగారు, శకుంతలమ్మగారు పాల్గొన్న భజనలు భక్తుల్నేకాకుండా ప్రేక్షకుల్నికూడా పరవశింపజేసేవి.  వెన్నమీదా, కుంకంమీదా బాబా పాదాలు కనబడటంలాంటి విచిత్రాలు