పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/249

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెక్కభజన

   గ్రామాలలో యువకులు రుమాళ్ళు నడుముకుబిగించి కుడిచేతిలో చెక్కతో చేయబడినచిడతలను తాళానుగుణంగా వాయిస్తూ, ఎడమచేతితో కీర్తనలోనిభావాన్ని అభినయంచేస్తూ ఒకవలయంగా నిలిచి కాళ్ళకు గజ్జెలుకట్టుకొని ఒకేరీతి గంతులువేస్తూ, కదులుతూ, వలయంలో గురువుండి ముందుపాడుతుంటే, అందరూ ప్రతిచరణం తిరిగి పాడుతూ, చూసేవాళ్ళకి భక్తిరసం ఉప్పొంగేలా చేస్తారుయీభజన.  లోపల వలయంలో హార్మోని, మద్దెలలు వాయిస్తుంటారు.  ఇది పండరి భజనలాంటిదే గాని ఆ వేషాలూ, అ జెండాలూ వుండవు.  ఆ పాటలు వేరు, నృత్యం కదలికలువరకూ మాత్రం అదే ధోరణి.
    ఇది ఒక గురువును పెట్టుకొని వర్షాకాలంలో పేటల్లో కుర్రకారు ఇరవై ముప్పైమంది ఈ పాటలు, ఈ నృత్యం, అభినయం నేర్చుకుంటారు.  ఇంచుమించు పేటకో బృందం వుండేది.  పేటలోగల ఆలయాలముందు వీరు అభ్యాసంచేసేవారు.  ఆ పాటలుకూడా శబ్దోచ్చారణలో నాటుగావున్నా (గ్రామ్యం) దేవునిభక్తి, అనెకం గూడు కట్టుకొని వుంటాయి.,

.కిట్టమ్మా గొపాల బాలా కిట్టమ్మా,
 భజ నందా గోపాల బాల కిట్టమ్మా,
 గోపాల బాలా కిట్టమ్మా
కాళ్ళాకూగజ్జెలు కట్టి, వేళ్లాకు ఉంగ్రాలెట్టి
గోళ్ళాకు మెరుపులు దిద్ది
గోరింటాకు పెడతా రారా ||కి||
ఎనిమిదిమూళ్ళరవైనాలుగు
తొమ్మిది మూళ్ళూ ఇరవైఏడు
పదకొండు మూళ్ళు ముప్పై మూడు
పన్నేండుమూళ్లూ ముప్పై ఆరు ||కి||

  అనేది ఒక పాట.  జానపదులు విద్యావంతులు కాదుకదా! అందువల్ల యిలా పాటల్లో ఎక్కాలుకూడా ఎక్కించడం లెక్కలు సులువుగా నేర్చడానికి అయ్యుంటుంది.  చెక్కభజన ఈ క్రింది గనపతి ప్రార్ధనతో ప్రారంభిస్తారు.