పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/245

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వస్తారు. ఈమేళానికి ఒక నాయకురాలు ఉంటుంది. ఫిడేలు, హార్మోనియం మద్దెలలు ప్రక్కవాయిద్యాలు. వీరుసినిమాపాటలుపాడుతూ ఇద్దరుముగ్గురు ముందుకొచ్చి నాట్యాలు చేస్తుంటే మిగిలినవారు వెనుక దడిలానిలబడి తాళంకొడుతూ పాడుతుంటారు. సాధారణంగా విలాసపురుషులే ఇక్కడికి చేరేది. వారి సెలక్షన్ ప్రకారం వీరు పాడి ఆడుతుంటారు. తర్వాత తాంబూలాలిచ్చి రవంత రంగువేచేసి సొమ్ములు వసూలు చేస్తుంటారు. వీరు అప్పుడప్పుడు సిగ్గులేకుండా పచ్చిశృంగారంవెలగబెడుతూ రసికులను రెచ్ఫగొట్టడంకూడాకద్దు. ఇలాంటివానితో వీరిఎలుగుబంట్లనృత్యం (బేర్ డాన్సు) చెప్పుకోదగ్గది. ఒకామె మగ ఎలుగుగానూ, మరొక ఆమె ఆడ ఎలుగుగానూ నటిస్తూ చూపించే రతిక్రియ లాంటివి కాలం పండినవాళ్ళను కూడా కామపీడుతులను చేస్తాయి. అలగని వీరిదంతా చౌకబారునాట్యం అనడానికి వీలులేదు. వీరి మేజువాణీ ఉత్తమ నాట్యశ్రేణికి చెందిన పక్రియ. నాయకురాలు 'తూరూపు తెలావారే ' లాంటి జావళీలు పాడుతూ అభినయం పడుతుంటే "ఓహ్" అని తలఊపని పండితులుండరు.

            కో ల సం బ రం  
         "ఓరోరి వెంకన్న ఓరి వెంకన్న" అని పాడుతూ కోలతిప్పుతూ పచ్చని కొబ్బరాకులపందిరిక్రింద ఎక్కడైనా పాట నివిపించిందంటే అక్కడ కోలసంబరం చేస్తున్నారని నిర్దారణగా చెప్పవచ్చు.  తిరుపతి వెళ్ళివచ్చినవారు దీపారధనరోజునరాత్రి కధపెడతారు  "శ్రీరామా రామారామా మోరామా, రామయ్యా, హరి రామా, రామారా,మయఓధ్యారామా, అనేది దీనికి వంత.  ముకానికీ, గుండెలమీదా, బుజాలమీదా పెద్దపెద్ద నామాలు దిద్ది ఇద్దరు నూనెగుడ్డలు వెలిగించిన కోలలు త్రిప్పుతుంటే, ఇద్దరు సిబ్బి తాళాలు (పెద్దవి) వాయిస్తూ వంతపాడుతుంటే, మధ్యఒక్రు ఒకచేతిలో పేముబెత్తం, మరొకచేతిలో నెమలి ఈకల కట్ట పట్టుకొని ముందుకూ వెనుకకూ నడుస్తూ వెంకన్న బాబుకధ పాటరూపంలో పాడుతుంటారు.  ఇది పురాణాలలో చెప్పబడ్డ పద్మావతీ వెంకటేశ్వరుల కధకారు. అలివేలుమంగ, బీబీనాంచారమ్మ, వెంకన్నబాబులప్రణయం, విరహం వగైరాలతోకూడిన ఒక భిన్నమైన జానపద కధ.  తెలుగుప్రజలు ఇదే నిజమైన కధ అన్నంత నిష్టగా వింటారు.  కధలో అప్పుడప్పుడు కోలత్రిప్పేవారిలో