పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/244

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"కోలాటమును రాత్రి గాండ్లపేరణియు
  గేళీక జోకయు లీలనటింప",
అంతేగ్ఫాక భరతర్జనము (నందికేశుడు)లో ఏడవ అధ్యాఅంలో
కోలాటమొక ప్రత్య్హేకమైన నర్తనగా చెప్పబడింది.

     గోదావరిసీమలో యీ కోలాటానికి పశ్చిమగోదావరిజిల్లా కురవాళ్ళ
పాలెం జట్టు మంచి ప్రసిద్ధిపొందింది.

                     బు ట్ట బొ మ్మ లా ట

    బుట్టబొమ్మలాట ఉత్సవాలకె వెడతారు. పాములవాడు, పాములవాడిభార్య్హ, రాధ, కృష్ణుడు మొదలైనవి ఇందులోఉంటాయి. తలదగ్గరనుంచి బొడ్డుదిగువవరకు చెక్కతో పెద్దపెద్దబొమ్మలుచేసి వాని క్రింద పొడుగాటిపరికిణీ తొడిగి ఒక మనిషి ఆ పరికిణీలోదూరి ఆ బొమ్మను నెత్తికెత్తుకొని బొమ్మబుడ్డురంద్రంగుండా బయటికిచూస్తూ రామడోలు మేళంవారి వాయిద్యాని కనుగుణంగా అడుగులేస్తుంటారు. ఇలాగే గుర్రాల ముఖాలు చేసి, వానికి మేదరతడికతో శరీరాన్ని తయారుచేసి అలంకరించి ఒకమనిషిపాదాలకు రెండు మూడడుగుల పొడవు కర్రలు కట్టుకొఇ గుర్రంమెడవద్దకన్నంలోంచి మొత్తవరకూ పైక్వచి గుర్రం మీద కూర్చొనికళ్ళెంపట్టుకుతోలుతున్నట్లు కనిపిస్తూ క్రింద గుర్రం నడుస్తున్నట్లు కట్టుకున్న కర్రలతో లయానుగుణంగానడుస్తాడు. ఇదికూడా చూఛముచ్చటగా ఉంటుంది. వానిని గంటలతరబది చూస్తూనేవుంటారు.

పశ్చిమగోదావరిజిల్లా 'తణుకు ' వాస్తవ్యులు శ్రీ కట్టా ఎల్లయ్యగారు యీప్రదర్శనలకు ప్రసిద్ధిపొందారు. అనంతరం అతినికుమారుడు సూర్యనారాయణగారు గత 50 ఏండ్లనుండీ కూడా ప్రదర్శనలిస్తున్నారు. వీరు రాధాకృష్షులు, శివపార్వతులు మొదలగునవి ప్రదర్సిస్తారు. బుట్టబొమ్మల తయారీకి వెదురుగడలు, చింతగింజలగుజ్జు ఉపయోగిస్తారు. వెదురుగడలతో బొమ్మనుచేస్తారు. చింతపండు గుజ్జుతో బొమ్మరూపు దిద్దుతారు.

                          భోగం మేళాలు/big>

   ఇక బోగంమేళాలసంగతి అందరికీ తెలిసిందే. ఇది లేనిదే ఏ ఉత్సవానికీ కళలేదు. పది పదిహేనుమంది బోగపుస్త్రీలు మేళంగా