పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/246

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒకడు హాస్యగానిగామారి జోక్సువేస్తుంటే ప్రజలు పగలబడినవ్వుతూ భక్తితోనూ ఆసక్తితోనూ వినోదిస్తుంటారు. ఈ కధ చెప్పే జట్లకు ద్రాక్షారామందగ్గర వెల్లగ్రామం ప్రసిద్ధి. అందులో సుబ్బారావుజట్టు మరీ పేరెన్నికగన్నది.

                          భై టో భ జ న
   ప్రతి పల్లెలోనూ దేవాలయం ఉంటుంది - కనీసంరామాలయం అన్నా ఉంటుంది.  కొనిచోట్ల కులానికో రామాలయం, పేటకో రామాలయంకూడా ఉంటాయి.  రాత్ర్రివేళల్లోనూ ఊళ్ళో భక్తులు ఈ ఆలయమండపాలలో కూర్చుని దేవుని ఫొటో ఎదురుగా పెట్టుకుని ఇత్తడి తాళాలతో భగవంతునిపై గూర్చిన పాటలు, పద్యాలు పాడుతూ భజనలు చేస్తారు.  వీనికి హార్మోనియం, మద్దెలలు తోడుంటాయి.  గణపతి ప్రారహ్నతో ప్రారంభించి బక్తరామదాసు కీర్తనలు, యడ్ల రామదాసు కీర్తనలు, త్యాగరాజు కీరనలు, తూము నరసింహదారు కీర్తనలు, తరంగాలు, గీతాలు, తత్వాలు ప్రతిచరణము. ఒకరు ముందుపాడితే తర్వాత అదే చరణాన్ని మిగిలినవారు పాడతారు.  పాడేవారుగొంతు మాధుర్యాన్ని బట్టి ఈ భజన చూడడానికి (చెయ్యడం చేత కాకపోయిన సరే) ఎంతోమంది చేరతారు.  మొదటపాడేవ్యక్తి సాధారణంగా మంచి గాయకుడై ఉంటాడు.  కూర్చునిచేసేదిగనుక దీనిని భైబోభజన అన్నారు.  మధ్య మధ్య కాళహస్తీశ్వర శతకంలోని, దాశారదీ శతకంలోనివి, ఇతర శతకాలలోనివి పద్యాలు రాగయుక్తంగ్ఫా పాడుతూ రంజింప చేస్తుంటారు.  ఈ భజనలో నేర్పరులైనవారు సప్తతాళాల భజనకూడా చేస్తారు.  మధ్య మధ్య "రామ రాఘవ రక్షించుము దేవ" వంటి కీర్తనలలోని మిత్రమ్లకు అనుగుణంగా తిరుగుడుతాళాలభజన ఛేస్తుంటే ఆ జోరులో చేతులు భరత నాట్యం  ఆడుతున్నట్లు చోద్యంగా కనిపిస్తాయి.  వచ్చినభక్తులంతా అరటిపళ్ళు, కొబ్బరికాయలుతెచ్చి దేవునికి నైవేద్యం పెడతారు.  అవన్నీ ముక్కలుగాకొసి భజనకార్యక్రమము పూర్తయ్యాక హారిచ్చి ప్రసాదంగా భక్తులకు పంచుతారు.  (అందులోకూడా వెండి బంగారుకాసులుంటారనుకోండి). ఇందులో ఏ అలసటా లేకుండా పాడే అందరికీ సులువైన పాటల్లో 'రామ రామరామ సీత ' అనేది ఒకటి.  'సీతారాం, సీతారామ్,