పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/217

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరగుడిసెలు
చద్దన్నంతిన్నమ్మ మొగుడాకలి ఎరగదని
చావుకు పెడితేగాని లంకణాలకురాదు
చావుతప్పి కన్ను లొట్టోయినట్టు
చింతచచ్చినా పులుపుచావదు
చిత్తం శివునిమీద భక్తి చెప్పులమీద
చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలి
చీరసింగారించుకొనేటప్పటి ఊరు మాటుమడిగిందట
చెట్టుచెడేకాలానికి కుక్కమూతిపిందెలు పూట్టినట్టు
చెవిటివాడి దగ్గర శంఖమూదినట్టు
చేతిచమురు భాగోతం
చేతులుకాలేక ఆకులుపట్టుకున్నట్టు
చుట్టంగావచ్చి దెయ్యమైపట్టుకుందట
చచ్చినోడిపెళ్ళికి వచ్చిందేకట్నం
చెట్టుపేరుచెప్పి కాయలమ్ముకున్నట్టు
చేసేచేసేకాపురం చెడదొభ్భకపొతే నేను నీరంకుమొగుణ్ణేకాదన్నాడట
చాదస్తపుమొగుడుఇ చెబితేవినడు, కొడితేఏడుస్తాడు
చిక్కినతగువా చిక్కనితగువా అని
చూపుడుగుర్రమేగాని చురుకుదనంలేదు
చెడిస్నేహితుడింటికైనా పోవచ్చుగాని చెల్లెలింటికి వెళ్ళకూడదు.
చెబితేపాపంగాని తిరగేసికొడితే చస్తుందనాడట
చెరపడానికి చేటపెయ్యిచాలు
చెరుమీదకోపగించి కడుక్కోవడంమానేసినట్టు
చెరువులో గేదెనెట్టి కొమ్ములుబేరమాడినట్టు
జోగీజోగీరాసుకుంటే బూడిదరాలిందన్నట్టు
జరుగుబాటుంటే జ్వరమంత సుఖంలేదు
జిమ్మకోరుచి, పుర్రెకోబుద్ది
డూడూ బసవన్నా అంటే తలూపినట్టు
తనకిలేదనిఏడిస్తే ఓకన్నుపోయిందట,ఎదుటివారికుందనిపిస్తే
రెండోకన్ను పోయిందట.
తడికలుతినేవాడికి అప్పడాలులెక్కాఅని