పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/218

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తక్కువనోమునోచి ఎక్కువఫలంరమ్మంటే వస్తుందా?
తడిగుడ్డతో గొంతుకోసే రకం
తలప్రాణం తోక్కొచ్చింది
తలా తోకా లేని కధలాగ
తల్లిపుట్టిల్లు మేనమామదగ్గరా ?
తాచెడ్డకోతి వనమెల్లాచెరిచినట్టు
తానుపట్టిన కుందేటికి మూడేకాళ్ళన్నట్టు
తానుదూరడానికి కంతలేదుగాని మెడకోడోలు అన్నట్టు
తాపులగొడ్దుకి రోలడ్డం

తానువలచిందిరంభ తానుమునిగిందిగంగ
తింటేగానిరుచీ దిగితేగానిలోతూతెలీవు
తిండికితిమ్మరాజు పనికిపోతురాజు
తిన్నఇంటి వాసాలు లెక్కపెట్టేరకం
తిట్టేనోరూ, తిరిగేకాళ్ళూ ఊరుకోవ్
తీగలాగితే డొంకంతా కదిలిందని
తుంటిమీదకొడితే ముందుపళ్ళురాలినట్టు
తులసివనంలో గంజాయిమొక్క మొలిచినట్టు
తెగించినవాడికి తెడ్డేలింగమన్నట్టు
తొడసంబంధం తొంభయ్యేళ్లదాకా పోదు
తుమ్మితేఊడే ముక్కు ఎన్నాళ్లుంటుంది?
తల్లి కదుపుచూస్తుంది, పెళ్ళాం జెబుచూస్తుంది
తల్లికికూడెట్టనోడు పినతల్లికికోకెడతాడా?
తాతా పెళ్లిచేసుకుంటావాఅంటే ఇచ్చేవారెవరూ అంటాడట
తాతల్నాడు నెతులుతాగారు మామూతులు వాసన చూడమన్నట్టు
తాటిచెట్టుకింద పాలు తాగినా కల్లే అంటారు.
తొక్కితేరాయి, మొక్కితే దేవుడు
తద్దినంపెట్టినోడి తమ్ముళ్ళగ
తినబోతూ రుచి అడగడమెందుకు ?
తన్నితే బూరెలబుట్టలోపడ్డట్టు
తీర్ధానికి తీర్ధం, ప్రసాదానికి ప్రసాదం
తాటాకుచప్పుళ్లకు కుందేళ్లు బెదరవు