పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/216

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుమ్మడికాయలదొంగ అంటే భుజాలుతడుముకున్నట్టు
గుర్రంగుడ్దిదైనా దాణాతప్పదు
గొడ్రాలికేంతెలుసు బిడ్డలసంగతి
గొర్రెలుతినెవాదు పొతే బర్రెలుతినేవాడొస్తాడ్
గోడకు చెవులుంటాయి
గోడదెబ్బ చెంపదెబ్బ
గోడమీద పిల్లివాటం
గంతకు తగిన బొంత
గరికిమేసిన గాడిదే పొతుంది
గొర్రెకసాయివాణ్ణే నమ్ముతుంది
గోటితోపోయేదాన్ని గొడ్డళ్ళదాకా తెచ్చినట్టు
గోరుదుట్టుమీద రోకలిపోటు
గునుపూడిజంగాలు అమ్మకిల్లుకట్టినట్టు
గుడ్డికన్న మూసినాఒకటే తెరిసినాఒకటే
గోచీకిచిన్నా గోణానికి పెద్దా
గండంగడిచి పిండంబయటపడింది
గాడిదకిగడ్డేసి, ఆవునిపాలిమ్మంటే ఎలా ?
గాదిలోగింజలుగాదిలోనే ఉండాలి, బిడ్డలు బీరకాల్లాగుండాలి
గాలికిపోయిన పేలపింది కృష్నార్పణం అన్నట్టు
గువిందపూస గుడ్డుకింద నలుపెరుగదట
గొంతులో పచ్చెలక్కాయ పడ్డట్టు
గోడవతలగోలేటంటే కోమట్లరహస్యాలన్నాడట
గోడకికొట్టినసున్నం, సానికిపెట్టినసొమ్ము తిరిగిరావు
గోవును గోలెందగ్గరికితీసుకెళ్ళగలంగానె కుడితి తినిపించగలమా ?
చల్లకొచ్చి ముంతదాయడమెందుకు ?
చూసిరమ్మంటే కాల్చి వచ్చాడట
చంద్రునికో నూలుపోగులాగ
చచ్చినోడి కళ్ళు చేరడేసి
చదవేస్తే ఉన్నమతి పోయిందట
చదువుకోకముందు కాకరకాయంటే చదువుకున్నాక కీకరకాయన్నాడట.