పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/183

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'బావా బావా పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
వీదీ వీధీ తిప్పేరు
వీశెడు గుద్దులు గుద్దేరు
మూలా మంచం వేశారు
ముంతెడు గెంజీ పోశారు" అని మరదళ్ళు పెళ్ళికొడుకుని పరిహాసంచేస్తూ పాడేపాట,

"కలికి కవాటము బంధనచేసిన కారణమెమో తెల్పాగదే" అని తలుపుదగ్గర పాట పళీతంతులో మంచి వినోదాన్నందించే రత్నాలు.

"పోయిరామాతల్లి పోయిరామాయమ్మ ' అని బిడ్డను సాగనంపుతూ 'అరిటాకువంతిది ఆదజన్మంబు ఎవ్వరేమన్ననూ ఎదురాడబోకె అంటూ అత్తింటికి పంపే ఘట్టంలోపాడే అప్పగింతలపాటకు కంటతదిపెట్టకుండాఉండడం అసాధ్యం.అంతటి రసోద్దీపనగల పాట అది.

                   భ క్తి గీ తా లు
శుభకార్యాల్లోనూ, దేవుడిపూజల్లోనూ స్త్రీలు దైవపరంగా మంగళహారతులిస్తూ చాలా మనోజ్ఞంగా పాడతారు. అందులో-
"జయా జయ మంగళం నిత్య శుభమంగళం" అనేది 'మంగళహారతిదే ' అనేది,
     "రామచంద్రాయజనక
      రాజితామనోహరాయ
      మామకాభీష్ట దాయ
      మహిత మంగలం"
 
అనేది సుప్రసిద్ధమైన పాటలు. పళ్ళెంలో హారతికర్పూరం వెలిగించి హారితిస్తూ ఇలాపాడేది ఆయాకార్యాలను ముగింపుచెస్తుంటే చూపరులకు అదొక దియానుబూతి. శివునిమీదపాడే ఈక్రిందిపాట వ్యాజస్తురితో మరీ మనోహరంగా ఉంటుంది.

"ఏమయా సాంబ శివశివా కైలాసవాసా ఏమయా సాంబ శివశివా
  ఏమయా సాంబశివశివవా సొమ్ములేల లేకపోయె